ముంబై: భారత క్రికెట్(టీమిండియా)లో మంచి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న క్రికెటర్లలో అనిల్ కుంబ్లే ఒకడు. టీమిండియా జట్టు కెప్టెన్‌గానే కాకుండా ప్రధాన కోచ్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు కుంబ్లే. అయితే తాజాగా జింబాంబ్వే మాజీ క్రికెటర్ పొమ్మి మాంగ్వా నిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌లో తన కోచ్ పదవిపై కుంబ్లే స్పందించారు. ఆయన స్పందిస్తూ.. టీమిండియాకు ప్రధాన కోచ్‌గా తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించానని, కానీ తన కోచ్ పదవిని చివర్లో ఇంకా మెరుగ్గా నిర్వహిస్తే బాగుండేదని తెలిపాడు.
తాను కోచ్ పదవిని మెరుగ్గా నిర్వర్తించానని కుంబ్లే అన్నాడు. అయితే ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాలు కారణంగానే కుంబ్లే తన పదవిని అర్థాంతరంగా వదులుకోవాల్సి వచ్చిందని పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో కూడా కుంబ్లే కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెంటార్‌గా కుంబ్లే వ్యవహరించాడు. కేవలం కెప్టెన్‌గా, కోచ్‌గా మాత్రమే కాకుండా తన బౌలింగ్ నైపుణ్యంతో టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను కుంబ్లే అందించాడు. (చదవండి: అప్పుడు కుంబ్లేను కోహ్లి వద్దన‍్నాడు.. ఇప్పుడైతే?)
Comments
Please login to add a commentAdd a comment