రవిశాస్త్రి 'పేచీ' దేనికి? | why ravi shastri savals cac decision | Sakshi
Sakshi News home page

రవిశాస్త్రి 'పేచీ' దేనికి?

Published Sat, Jul 15 2017 12:48 PM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM

రవిశాస్త్రి 'పేచీ' దేనికి?

రవిశాస్త్రి 'పేచీ' దేనికి?

న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రిని ఎంపిక చేసిన తరువాత అతి పెద్ద సస్పెన్స్ కు తెరపడింది. అయితే జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా ఎంపిక చేయడం రవిశాస్త్రికి రుచించలేదు. తొలుత జహీర్ ఖాన్ ఎంపికను స్వాగతించిన రవిశాస్త్రి.. ఉన్నపళంగా మాటమార్చాడు. అసలు జహీర్ అనుభవం కోచ్ గా సరిపోదంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. దాంతో బీసీసీఐ అడ్వైజరీ  కమిటీ(సీఏసీ) నిర్ణయాన్ని నేరుగా ప్రశ్నించినట్లయ్యింది. మరొకవైపు జహీర్ తో పాటు రాహుల్ ద్రవిడ్ ను సైతం భారత కోచింగ్ స్టాఫ్లో చేర్చడాన్ని క్రికెట్ పాలకుల కమిటీ(సీవోఏ) కూడా తప్పుబట్టింది. ఆ ఇద్దర్ని ఎంపిక చేయడంలో సీఏసీ ఆంతర్యం ఏమిటని సీవోఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. బీసీసీఐ అడ్వైజరీ కమిటీకి అప్పజెప్పిన పని ఒకటైతే, మరో ఇద్దరి అభ్యర్ధుల్ని కోచింగ్ విభాగంలో ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

ఇక్కడ కోచ్ గా రవిశాస్త్రి అభ్యర్ధిత్వాని మాత్రమే స్వాగతించిన సీవోఏ.. జహీర్, ద్రవిడ్ ల ఎంపికపై అయిష్టత కనబరిచింది. ఆపై రవిశాస్త్రి కూడా .. జలింగ్ కోచ్ గా నియమించాలనే అభ్యర్ధను తెరపైకి తీసుకొచ్చాడు.హీర్ బౌలింగ్ కోచ్ గా సరిపోడు అంటూ వివాదానికి మరింత ఆజ్యం పోశాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన భరత్ అరుణ్ ను బౌలింగ్ కోచ్ గా నియమించాలనే అభ్యర్ధను తెరపైకి తీసుకొచ్చాడు. దాంతో జహీర్ 150 రోజుల పాటు మాత్రమే బౌలింగ్ విభాగంలో సేవలందిస్తాడంటూ సీఏసీ స్పష్టం చేసింది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా రవిశాస్త్రి తన పంతాన్ని దాదాపు నెగ్గించుకున్నట్లయ్యింది.


అనిల్ కుంబ్లేను అవమానకర రీతిలో కోచ్ పదవి నుంచి సాగనంపడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుంబ్లేపై సహజమైన అభిమానంతో పాటు, కోచ్ గా కూడా జట్టును ముందుకు తీసుకెళ్లడం.. వివాద రహితుడు కావడం చేత కుంబ్లేపై అభిమానులకు మంచి అభిప్రాయం ఉంది. ఇక్కడ  కుంబ్లే వైదొలగడానికి కారణమైన కెప్టెన్ విరాట్ కోహ్లి తీరును కూడా అభిమానులు తప్పుబట్టారు.

ఇదంతా ముగిసిన అధ్యాయం అయినప్పటికీ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి వచ్చేశాడు. అనేక సందిగ్ధతల మధ్య రవిశాస్త్రిని కోచ్ గా సీఏసీ ఎంపిక చేసింది. ఇది పూర్తిగా కోహ్లి ఇష్టానుసారంగానే రవిశాస్త్రి ఎంపిక జరిగిందనేది అందరికీ తెలిసిన సత్యమే. తొలుత కోచ్ ప్రకటనకు సంబంధించి కొన్ని రోజులు కావాలని తెలిపిన సీఏసీ.. ఆ మరసటి రోజే రవిశాస్త్రి పేరును ఖరారు చేసింది. ఇందుకు కారణం సీవోఏ. కోచ్ ఇంటర్వ్యూలు జరిగిన తరువాత జాప్యం చేయాల్సిన అవసరం ఏమిటని సీవోఏ ప్రశ్నించడంతో చేసేదిలేక కోహ్లికి ఇష్టమైన రవిశాస్త్రినే ఆ పదవి కట్టబెట్టింది. ఇదే సమయంలో జహీర్, ద్రవిడ్ లను కూడా కోచింగ్ స్టాఫ్ లో చేర్చింది. దాన్ని రవిశాస్త్రి ఘనంగా స్వాగతించాడు కూడా.

మరి ఇప్పుడు తనకు బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ కావాలంటూ రవిశాస్త్రి 'పేచీ' పెట్టడానికి కారణం ఏమిటనేది సస్పెన్స్. వచ్చే వరల్డ్ కప్ వరకూ జట్టుకు ప్రధాన కోచ్ గా ఉండే రవిశాస్త్రికి వివాదం అవసరమా?, ఆటగాళ్లతో నవ్వుతూ సర్ధుకుపోతేనే మంచి ఫలితాలు వస్తాయనే రవిశాస్త్రి కొత్త వివాదం ఎందుకు?, సీఏసీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీపై ఇది పరోక్ష ప్రతీకారామా?.. ప్రస్తుతం వీటికి సమాధానం దొరకపోయినా తనను కోచ్ గా ఎంపిక చేసిన సీఏసీని సవాల్ చేయడం రవిశాస్త్రి భవిష్యత్ను ప్రశ్నార్ధకం చేసే అవకాశం కూడా లేకపోలేదు. మరి దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement