
నాటింగ్‌హమ్: ఇంగ్లండ్ సీనియర్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లే(619 వికెట్లు)తో సమానంగా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని గోల్డెన్ డక్(0) చేయడం ద్వారా అండర్సన్ 619వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు తద్వారా కుంబ్లే 619 టెస్టు కెరీర్ వికెట్ల రికార్డును సమం చేశాడు.
కాగా సంప్రదాయ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్ల రికార్డు ఇప్పటికీ మురళీధరన్ (శ్రీలంక; 800) పేరిట పదిలంగా ఉండగా, తర్వాతి స్థానాల్లో షేన్ వార్న్ (ఆస్ట్రేలియా; 708), కుంబ్లే (619) ఉన్నారు. 2003లో అరంగేట్రం చేసిన అండర్సన్ 163వ టెస్టుతో కుంబ్లే మైలురాయిని చేరుకున్నాడు. ఓవరాల్‌గా అండర్సన్ 163 టెస్టుల్లో 619 వికెట్లు, 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment