Viral Video: Virat Kohli Serious Argument With James Anderson In Ind Vs Eng - Sakshi
Sakshi News home page

Virat Kohli: 'పిచ్‌ నీ సొంతం కాదు.. పరిగెత్తడానికి' అండర్సన్‌కు కోహ్లి వార్నింగ్‌

Published Sun, Aug 15 2021 7:00 PM | Last Updated on Mon, Aug 16 2021 9:56 AM

IND Vs ENG: Virat Kohli Heat Argument With James Anderson Running Over Pitch - Sakshi

లార్డ్స్‌: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత అండర్సన్‌ బుమ్రా బంతులపై అతన్ని నిలదీశాడు.. కానీ బుమ్రా దాన్ని పట్టించుకోకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇది మరువక ముందే అండర్సన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో అండర్సన్‌కు చిన్నపాటి మాటల యుద్ధం చోటుచేసుకుంది. 

విషయంలోకి వెళితే.. నాలుగో రోజు ఆటలో టీమిండియా ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ను జేమ్స్‌ అండర్సన్‌ వేయగా.. క్రీజులో పుజారా ఉన్నాడు. ఓవర్‌ నాలుగో బంతిని వేసిన తర్వాత అండర్సన్‌ పిచ్‌పై పరిగెత్తాడు. దీనిని చూసిన కోహ్లి అండర్సన్‌ను ఉద్దేశించి..'' పిచ్‌ నీ సొంతం అనుకున్నావా.. పరిగెత్తడానికి'' అంటూ ఫన్నీవేలో వార్నింగ్‌ ఇచ్చాడు. అయితే అండర్సన్ ఇది ఏం పట్టించుకోకుండా వెళ్లాడు. ఐదో బంతి వేశాకా.. కోహ్లిని అండర్సన్‌ ఏదో అన్నాడు.. దీనికి కోహ్లి వెంటనే '' క్రిప్‌.. క్రిప్‌.. క్రిప్‌'' అంటూ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఓవర్‌ ముగియడంతో వీరిద్దరి మాటల యుద్ధం అక్కడితో ముగిసింది. అయితే దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం 35 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌ 31 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. పుజారా 6, రహానే 4 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement