లార్డ్స్: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ సీనియర్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. స్వతహాగా లార్డ్స్‌లో మంచి రికార్డు కలిగిన అండర్సన్ మరోమారు ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతోపాటు అండర్సన్‌కు లార్డ్స్ మైదానంలో భారత్‌పై మంచి రికార్డే ఉంది. 2007 నుంచి చూసుకుంటే భారత్‌పై లార్డ్స్ టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అండర్సన్ మరో రెండుసార్లు నాలుగు వికెట్లు తీశాడు.
ఓవరాల్‌గా లార్డ్స్ మైదానంలో టీమిండియాపై అండర్సన్ టెస్టుల్లో ఇప్పటివరకు 33 వికెట్లు తీశాడు. ఇక టెస్టుల్లో అండర్సన్ 5 వికెట్ల ఘనతను సాధించడం ఇది 31వ సారి. ఓవరాల్‌గా అండర్సన్ 164 టెస్టుల్లో 626 వికెట్లు తీశాడు. ఇక రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ 129 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ 83, కోహ్లి 42, జడేజా 40 పరుగులు చేశారు.
A 31st five-wicket haul for James Anderson!
— ICC (@ICC) August 13, 2021
What a star 🌟#WTC23 | #ENGvIND pic.twitter.com/Y7wNXrCwec
Comments
Please login to add a commentAdd a comment