
లార్డ్స్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు టెస్టుల్లో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. విచిత్రమేమిటంటే.. బెయిర్ స్టో టెస్టుల్లో చివరి అర్థ సెంచరీ నమోదు చేసింది లార్డ్స్ మైదానంలోనే. 2019లో లార్డ్స్ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బెయిర్ స్టో 52 పరుగులు చేశాడు. రెండేళ్ల తర్వాత అర్థ సెంచరీ మార్క్‌ను అందుకోవడంతో బెయిర్ స్టో తన బ్యాట్‌ను డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకోవడం వైరల్‌గా మారింది. కెప్టెన్ రూట్ కూడా బెయిర్ స్టోను అభినందిస్తూ హగ్ చేసుకున్నాడు. కాగా బెయిర్ స్టో ఇంగ్లండ్ తరపున 76 టెస్టుల్లో 4307 పరుగులు, 89 వన్డేల్లో 3498 పరుగులు, 57 టీ20ల్లో 1143 పరుగులు చేశాడు
ఇక టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతుంది. లంచ్ సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. జో రూట్ 89 పరుగులతో సెంచరీకి చేరువ కాగా.. జానీ బెయిర్ స్టో 51 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ రెండు.. షమీ ఒక వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment