లార్డ్స్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రివ్యూలు అంతగా కలిసిరావనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోహ్లి రివ్యూ తీసుకున్న వాటిలో ఎక్కువ ఫలితాలు మనకు వ్యతిరేకంగానే వచ్చేనవే ఉన్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ ఎంత వద్దని వారించినా మాట వినకుండా సిరాజ్‌పై నమ్మకంతో కోహ్లి రివ్యూ కోరాడు. కానీ ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. కానీ ఈసారి కోహ్లి అంచనా తప్పలేదు. అతనికి రివ్యూ కలిసి రావడమే గాక బెయిర్ స్టో లాంటి డేంజర్ ఆటగాడిని వెనక్కి పంపిచడంలో సక్సెస్ అయ్యాడు. ఒక రకంగా మ్యాచ్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. బెయిర్ స్టో అవుటైన తర్వాతి బంతికే రూట్ కూడా వెనుదిరగడం ఇంగ్లండ్ ఓటమిని దాదాపు ఖరారు చేసింది.
విషయంలోకి వెళితే.. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇషాంత్ శర్మ వేసిన 21వ ఓవర్ చివరి బంతి జానీ బెయిర్ స్టో ప్యాడ్లను తాకింది. దాంతో భారత ఆటగాళ్లంతా గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దాంతో కోహ్లీ రివ్యూ తీసుకుందామని చెప్పగా ఇతర ఆటగాళ్లంతా వద్దని వారించారు. బంతి.. బ్యాట్‌కు తగిలిందనే సందేహం వ్యక్తం చేశారు. కానీ తగలలేదని గట్టి విశ్వాసంతో ఎవరూ చెప్పినా వినకుండా కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. తీరా రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకలేదు. పైగా బాల్ ట్రాకర్‌లో మిడిల్ వికెట్‌ను హిట్ చేయడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. దాంతో విరాట్ కోహ్లీ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ప్రపంచకప్ గెలిచినంత సంతోషం వ్యక్తం చేశాడు. ఇతర ఆటగాళ్లు సైతం కోహ్లీ నిర్ణయాన్ని సమర్థిస్తూ మెచ్చుకున్నారు.
Mann i love Virat Kohli
— Adi (@_adityakush_) August 16, 2021
This is India!
This is Virat Kohli's India!#engvsindia #ViratKohli pic.twitter.com/MHOXvo2qcm
Celebration after #Bairstow wicket show how intensified is the game.#INDvENG #ViratKohli #IshantSharma pic.twitter.com/itnufNgcOc
— शुभांकर मिश्रा (@shubhankrmishra) August 16, 2021
Comments
Please login to add a commentAdd a comment