DRS Referral
-
ఎవరు చెప్పినా వినలేదు.. అదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్
లార్డ్స్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రివ్యూలు అంతగా కలిసిరావనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోహ్లి రివ్యూ తీసుకున్న వాటిలో ఎక్కువ ఫలితాలు మనకు వ్యతిరేకంగానే వచ్చేనవే ఉన్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ ఎంత వద్దని వారించినా మాట వినకుండా సిరాజ్‌పై నమ్మకంతో కోహ్లి రివ్యూ కోరాడు. కానీ ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. కానీ ఈసారి కోహ్లి అంచనా తప్పలేదు. అతనికి రివ్యూ కలిసి రావడమే గాక బెయిర్ స్టో లాంటి డేంజర్ ఆటగాడిని వెనక్కి పంపిచడంలో సక్సెస్ అయ్యాడు. ఒక రకంగా మ్యాచ్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. బెయిర్ స్టో అవుటైన తర్వాతి బంతికే రూట్ కూడా వెనుదిరగడం ఇంగ్లండ్ ఓటమిని దాదాపు ఖరారు చేసింది. విషయంలోకి వెళితే.. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇషాంత్ శర్మ వేసిన 21వ ఓవర్ చివరి బంతి జానీ బెయిర్ స్టో ప్యాడ్లను తాకింది. దాంతో భారత ఆటగాళ్లంతా గట్టిగా అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దాంతో కోహ్లీ రివ్యూ తీసుకుందామని చెప్పగా ఇతర ఆటగాళ్లంతా వద్దని వారించారు. బంతి.. బ్యాట్‌కు తగిలిందనే సందేహం వ్యక్తం చేశారు. కానీ తగలలేదని గట్టి విశ్వాసంతో ఎవరూ చెప్పినా వినకుండా కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. తీరా రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకలేదు. పైగా బాల్ ట్రాకర్‌లో మిడిల్ వికెట్‌ను హిట్ చేయడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. దాంతో విరాట్ కోహ్లీ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ప్రపంచకప్ గెలిచినంత సంతోషం వ్యక్తం చేశాడు. ఇతర ఆటగాళ్లు సైతం కోహ్లీ నిర్ణయాన్ని సమర్థిస్తూ మెచ్చుకున్నారు. Mann i love Virat Kohli This is India! This is Virat Kohli's India!#engvsindia #ViratKohli pic.twitter.com/MHOXvo2qcm — Adi (@_adityakush_) August 16, 2021 Celebration after #Bairstow wicket show how intensified is the game.#INDvENG #ViratKohli #IshantSharma pic.twitter.com/itnufNgcOc — शुभांकर मिश्रा (@shubhankrmishra) August 16, 2021 -
కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే
సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ బ్యాటింగ్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో టి. నటరాజన్ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీతో ధాటిగా ఆడుతున్నాడు. ఓవర్లో నటరాజన్ వేసిన నాలుగో బంతి వేడ్ ప్యాడ్లను తాకింది. కానీ నటరాజన్.. కీపర్ రాహుల్ ఎల్బీపై అంపైర్‌కు అప్పీల్ చేసినా ఎటుంటి స్పందన రాలేదు... టీమిండియా కూడా రివ్యూ కోరలేదు. (చదవండి : అయ్యో! చహల్ ఎంత పని జరిగింది) అయితే థర్డ్ అంపైర్ చూపించిన రిప్లైలో మాత్రం వేడ్ ఔట్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మైదానంలోని బిగ్స్క్రీన్పై వేడ్ ఔట్ అయినట్లు కనిపించడంతో షాక్ తిన్న కోహ్లి రివ్యూ కోరాడు. కానీ అంపైర్ కోహ్లి రివ్యూను తిరస్కరించారు. సమయం మించిన తర్వాత రివ్యూ కోరావని.. అందుకే తిరస్కరించామని అంపైర్లు చెప్పడంతో కోహ్లి ఏం చేయలేకపోయాడు. ఒకవేళ కోహ్లి రివ్యూ కోరుంటే 50 పరుగుల వద్ద వేడ్ ఔటయ్యేవాడు. అలా బతికిపోయిన వేడ్ ఆ తర్వాత మరో 30 పరుగులు రాబట్టాడు.కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే ఫలితం వేరేలా ఉండేది అని అభిమానులు పేర్కొంటున్నారు. (చదవండి : స్టాండ్స్‌లోకి పంపుదామనుకుంటే స్టన్ అయ్యాడు..) -
వెక్కిరింత: స్మిత్.. ఈ కోహ్లిని చూశావా..??
-
వెక్కిరింత: స్మిత్.. ఈ కోహ్లిని చూశావా..??
తొలి వన్డేలో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు డీఆర్ఎస్ రివ్యూను కోల్పోయినప్పుడు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. ప్రత్యర్థి స్టీవ్ స్మిత్‌ని ఒకింత విచిత్రంగా ఎద్దేవా చేశాడు. తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలో తడబడ్డ సంగతి తెలిసిందే. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను హర్థిక్ పాండ్యా, మహేంద్రసింగ్ ధోనీ తమ విలువైన భాగస్వామ్యంతో గట్టెక్కించారు. 66 బంతుల్లో 83 పరుగులు చేసి చెలరేగి ఆడిన పాండ్యా ఔటైన తర్వాత భువనేశ్వర్ క్రీజ్‌లోకి వచ్చాడు. 45వ ఓవర్లో బౌలర్ మార్కస్ స్టోయినిస్ భువీ ఎల్బీడబ్ల్యూ కోసం అంపైర్‌కు అప్పీల్ చేశాడు. అంపైర్ ఈ అప్పీల్‌ను తిరస్కరించడంతో అతను ఏకంగా డీఆర్ఎస్ రివ్యూ (టీవీ రిప్లే) కోరాడు. టీవీ రిప్లేలో స్పష్టంగా బంతి బ్యాటుకు తగిలనట్టు తేలింది. అసలు బంతిని భువీ ప్యాడ్స్‌ను తాకని విషయం స్పష్టమైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు రివ్యూ అవకాశాన్ని కోల్పోయింది. నిరాశతో ఆసీస్ కెప్టెన్ స్మిత్ ముఖం పాలిపోగా.. ఈ సమయంలో కోహ్లి భుజాలను కదిలిస్తూ.. ఔటైనట్టు వేలిని చూపిస్తూ ఒకింత విచిత్రంగా స్మిత్‌ను ఎగతాళి చేశాడు. టీవీలో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో దృశ్యాన్ని క్యాపర్ చేసిన ఓ నెటిజన్ దీనిని ట్విట్టర్లో పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కోహ్లి విచిత్రమైన ఎగతాళిపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు. రివ్యూ కోల్పోగానే స్మిత్‌ను ఎద్దేవా చేసిన కోహ్లి