అంతా బాగానే ఉంది! | No adverse views on Kohli-Kumble relation in manager's report | Sakshi
Sakshi News home page

అంతా బాగానే ఉంది!

Published Mon, Jul 3 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

అంతా బాగానే ఉంది!

అంతా బాగానే ఉంది!

న్యూఢిల్లీ: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే మధ్య ఎలాంటి వివాదాస్పద సంఘటన జరగలేదని టీమ్‌ మేనేజర్‌ కపిల్‌ మల్హోత్ర తన నివేదికలో తెలిపారు. స్వదేశంలో లేక విదేశాల్లో భారత జట్టు సిరీస్‌ ముగిశాక బీసీసీఐకి జట్టు మేనేజర్‌ నివేదిక ఇవ్వడం పరిపాటి. దీంట్లో భాగంగా ఇచ్చిన నివేదికలో జట్టులో ఎలాంటి సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు. కెప్టెన్‌తో విభేదాల కారణంగానే కోచ్‌ కుంబ్లే రాజీనామా చేశాడని గతంలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

తన శైలిపై కెప్టెన్‌కు అభ్యంతరాలు ఉన్నాయనే విషయాన్ని కుంబ్లే సైతం అంగీకరించారు. అయితే కపిల్‌ నివేదిక మాత్రం వీటినేమాత్రం పేర్కొనలేదు. ‘మేనేజర్‌ నివేదిక అందింది. కోచ్‌తో కెప్టెన్‌ అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టు ఆయన పేర్కొనలేదు. అలాగే ఇద్దరి మధ్య ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన జరగలేదనే దాంట్లో ఉంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement