
న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా బంతి మెరుపును మరింత పెంచేందుకు... రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు బౌలర్లు ఉమ్మి (సలీవా)ని ఉపయోగిస్తుంటారు. అయితే ఉమ్మి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ఇక మీదట మ్యాచ్‌ల సందర్భంగా బౌలర్లు ఉమ్మిని బంతిపై రుద్దకుండా నిషేధం విధించాలని అనిల్ కుంబ్లే నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) సిఫారసు చేసింది. కరోనా నేపథ్యంలో కొన్నాళ్లపాటు తటస్థ అంపైర్లను కాకుండా... అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆతిథ్య దేశ అంపైర్లను అంపైరింగ్ చేసే అంశాన్ని పరిశీలించాలని కూడా ఐసీసీ క్రికెట్ కమిటీ సిఫారసు చేసింది. క్రికెట్ కమిటీ ప్రతిపాదనలను పరిశీలించాకే వీటిని అమలు చేయాలా వద్దా అనే విషయాన్ని ఐసీసీ బోర్డు నిర్ణయిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment