ICC cricket committee
-
వీవీఎస్ లక్ష్మణ్ కు ఐసీసీలో కీలక పదవి
-
బంతిపై ఉమ్మి వాడొద్దు...
న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా బంతి మెరుపును మరింత పెంచేందుకు... రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు బౌలర్లు ఉమ్మి (సలీవా)ని ఉపయోగిస్తుంటారు. అయితే ఉమ్మి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ఇక మీదట మ్యాచ్‌ల సందర్భంగా బౌలర్లు ఉమ్మిని బంతిపై రుద్దకుండా నిషేధం విధించాలని అనిల్ కుంబ్లే నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) సిఫారసు చేసింది. కరోనా నేపథ్యంలో కొన్నాళ్లపాటు తటస్థ అంపైర్లను కాకుండా... అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆతిథ్య దేశ అంపైర్లను అంపైరింగ్ చేసే అంశాన్ని పరిశీలించాలని కూడా ఐసీసీ క్రికెట్ కమిటీ సిఫారసు చేసింది. క్రికెట్ కమిటీ ప్రతిపాదనలను పరిశీలించాకే వీటిని అమలు చేయాలా వద్దా అనే విషయాన్ని ఐసీసీ బోర్డు నిర్ణయిస్తుంది. -
ద్రావిడ్‌కు మరో కీలక బాధ్యత
న్యూఢిల్లీ: భారత్ ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు మరో కీలక బాధ్యతలు అప్పగించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కమిటీలో ద్రావిడ్‌తో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ టిమ్ మేను నియమించారు. వీరు మూడేళ్ల పాటు కమిటీలో కొనసాగనున్నారు. పదవీకాలం ముగిసిన సంగక్కర, లక్ష్మణ్, మార్క్ టేలర్ స్థానాల్లో వీరిని ఎన్నుకున్నారు. ఈ నెల 31, జూన్ 1న జరిగే ఐసీసీ క్రికెట్ కమిటీ తొలిసమావేశంలో వీరు పాల్గొంటారు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు. 2012లో కుంబ్లేకి తొలిసారి ఈ బాధ్యతలు అప్పగించారు. తాజా నియామకంతో కుంబ్లే 2018 వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు. కమిటీలో అంపైర్ల ప్రతినిధిగా స్టీవ్ డేవిస్ స్థానంలో రిచర్డ్ కెటిల్‌బరో ఎన్నికయ్యాడు. -
నాన్ స్ట్రయికర్ను ఆపండి
బౌలర్ బంతి వేశాకే క్రీజు వదలాలి ఆటగాళ్ల దురుసు ప్రవర్తనపై కఠిన చర్యలు ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదనలు బెంగళూరు: సాధారణంగా బౌలర్ బంతిని వేసిన తర్వాతే నాన్ స్ట్రయికర్ క్రీజ్ వదిలి ముందుకెళ్లాలి, లేకపోతే అంపైర్లు బ్యాట్స్‌మన్‌ను అడ్డుకోవాలని ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదించింది. ‘నాన్ స్ట్రయికర్ ముందుగా క్రీజ్ వదిలితే అంపైర్లు ముందస్తు హెచ్చరిక చేయాలి. ఆ తర్వాత బౌలర్‌కు రనౌట్ చేసే అవకాశం ఇవ్వాలి. ఈ విధానానికి కెప్టెన్లు మద్దతిస్తే అంపైర్లు తుది నిర్ణయం తీసుకోవచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. ప్రస్తుతం ఆట ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలపై భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ రెండు రోజుల పాటు చర్చలు జరిపి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వికెట్ పడినప్పుడు నోబాల్స్‌ను చెక్ చేయడం బాగా విజయవంతమైందని, అలాగే డీఆర్ఎస్ వ్యవస్థ కూడా బాగా మెరుగైందని కమిటీ పేర్కొంది. మైదానంలో ఆటగాళ్ల దురుసు ప్రవర్తనపై అంపైర్లు కఠినంగా వ్యవహరించాలని, సందేహాస్పద యాక్షన్ ఉన్న బౌలర్ల శైలిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. రెండు రోజుల పాటు జరిగిన ఐసీసీ క్రికెట్ కమిటీ సమావేశంలో చేసిన ప్రతిపాదనలను... ఈ నెలాఖరున మెల్బోర్న్లోజరిగే ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చిస్తారు.