
టీ20 ప్రపంచకప్-2022 సెమీఫైనల్లో టీమిండియాకు ఘోర పరభావం ఎదురైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక టోర్నీనుంచి అవమానకర రీతిలో ఇంటిముఖం పట్టిన టీమిండియాపై కొంత మంది విమర్శలు వర్షం కురిపించగా.. మరికొంత మంది మద్దతుగా నిలిచారు.
అదే విధంగా టీ20 ప్రపంచకప్-2024కు భారత్ ఏ విధంగా సన్నద్ధం కావాలన్న చర్చ ప్రస్తుతం జరగుతోంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ అనిల్ కుండే తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టెస్టు, వైట్‌బాల్ క్రికెట్‌కు వేర్వేరు టీమ్స్ ఉండాలి అని కుంబ్లే సూచించాడు.
ఈఎస్పీఎన్ క్రికిన్ఫోతో కుంబ్లే మాట్లాడుతూ.. "ఖచ్చితంగా టెస్టు, వైట్‌బాల్ క్రికెట్ రెండు వేర్వేరు జట్లు ఉండాలి. ప్రతీ జట్టుకు టీ20 స్పెషలిస్టులు కావాలి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు, గతేడాది విజేత ఆస్ట్రేలియాకు చాలా మంది టీ20 స్పెషలిస్టులు ఉన్నారు. ఎక్కువ మంది ఆల్‌రౌండర్‌లు ఉండేలా జట్టును తయారు చేసుకోవాలి.
ఇంగ్లండ్‌ను చూసుకుంటే లివింగ్‌స్టోన్ వంటి అద్భుతమైన ఆటగాడు 7 వస్థానంలో బ్యాటింగ్ వస్తాడు. అదే విధంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ స్టోయినిస్ 6 స్థానంలో బ్యాటింగ్ రావడం మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం జట్టును నిర్మించాలి. దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలి" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2022: రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించండి! వాళ్లలో ఒకరిని సారథి చేయండి