India vs England, 1st Test Day 1: ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన భారత బౌలింగ్ జోడీగా ఘనత సాధించారు.
ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజ జంట అనిల్ కుంబ్లే- హర్భజన్ సింగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. కాగా భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.
246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం మొదలైన తొలి టెస్టులో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను 246 పరుగులకు ఆలౌట్ చేసింది.
భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు, రవీంద్ర జడేజా మూడు, అక్షర్ పటేల్ రెండు, జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశారు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆటలో అశూ- జడ్డూ మొదటి రోజు ఆటలో మొత్తం కలిపి ఆరు వికెట్లు తీశారు. దీంతో ఇప్పటి వరకు టెస్టుల్లో ఇద్దరూ కలిపి 505 వికెట్లు సంయుక్తంగా తమ ఖాతాలో వేసుకున్నారు.
కుంబ్లే- భజ్జీ రికార్డు బద్దలు
తద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలింగ్ జోడీగా నిలిచారు. అంతకు ముందు ఈ రికార్డు కుంబ్లే- హర్భజన్ (501) పేరిట ఉండేది. ఇక ఈ జాబితాలో హర్భజన్ సింగ్- జహీర్ ఖాన్ జోడీ(474), ఉమేశ్ యాదవ్- అశ్విన్ జంట(431) నాలుగో స్థానంలో ఉంది.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓపెనర్లు జాక్ క్రాలే(20), బెన్ డకెట్(35), మార్క్‌వుడ్(11) వికెట్లను అశూ పడగొట్టగా.. ఒలీ పోప్(1), జో రూట్(29), టామ్ హార్ట్లే వికెట్లను జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు.
తుదిజట్లు:
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్.
Comments
Please login to add a commentAdd a comment