సాక్షి, మచిలీపట్నం : ప్రముఖ క్రికెటర్, టీం ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కృష్ణా జిల్లాకు వచ్చేశారు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా సేవలందించిన తెలుగు తేజం సీకే నాయుడు విగ్రహాన్ని స్పిన్ దిగ్గజం కుంబ్లే మచిలీపట్నం (బందరు)లో ఆవిష్కరించారు. ఉదయం 9.30 గంటలకు మూడు స్తంభాల సెంటర్ దగ్గర కుంబ్లేకు క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి గోసంగం వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత 10 గంటలకు స్టేడియం నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు.
గోసంగం నుంచి ర్యాలీగా బయలు దేరి నేషనల్ కాలేజ్, రాజుపేట, కోనేరుసెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్ సెంటర్ మీదుగా జెడ్పీ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ టీమిండియా మాజీ కెప్టెన్ సీకే నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. నాయుడు టీమిండియాకు విశేష సేవలందించారని స్పిన్ దిగ్గజం కుంబ్లే కొనియాడారు. తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కుంబ్లే తెలిపారు. 1932–34 మధ్య కాలంలో ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్‌గా ఏపీ (బందరు)కి చెందిన సీకే నాయుడు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
సీకే నాయుడు విగ్రహం
Comments
Please login to add a commentAdd a comment