CK Nayudu Trophy
-
ఊచకోత.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌లతో
కల్నల్ సికె నాయుడు ట్రోఫీ-2024లో హర్యానా ఓపెనర్ యశ్వర్ధన్ దలాల్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా గుర్‌గ్రామ్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో యశ్వర్ధన్ ఏకంగా క్వాడ్రపుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై బౌలర్లను యశ్వర్ధన్ ఊచకోత కోశాడు. వన్డే తరహాలో ఈ హర్యానా బ్యాటర్ విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా 463 బంతులు ఎదుర్కొన్న యశ్వర్ధన్ దలాల్ 46 ఫోర్లు, 12 సిక్స్‌లతో 426 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ అర్ష్ రంగతో కలిసి యశ్వర్ధన్ 410 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.అర్ష్ రంగ(151) కూడా సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 748 పరుగుల భారీ స్కోరును సాధించింది.తొలి ప్లేయర్‌గా..ఇక ఈ మ్యాచ్‌లో క్వాడ్రపుల్ సెంచరీతో మెరిసిన యశ్వర్ధన్ పలు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కల్నల్ సికె నాయుడు ట్రోఫీలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా యశ్వర్ధన్ దలాల్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఉత్తరప్రదేశ్ స్టార్ ప్లేయర్ సమీర్ రిజ్వీ పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌరాష్ట్రపై సమీర్ రిజ్వీ(312) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో రిజ్వీ ఆల్‌టైమ్ రికార్డును యశ్వర్ధన్ బ్రేక్ చేశాడు.చదవండి: ENG vs WI: సాల్ట్ విధ్వంసకర సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ -
ట్రిపుల్ సెంచరీతో విజృంభించిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్
అండర్-23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ 2024 ఎడిషన్ తొలి క్వార్టర్ ఫైనల్లో ఉత్తర్‌ప్రదేశ్ ఆటగాడు, చెనై సూపర్ కింగ్స్ ప్లేయర్ సమీర్ రిజ్వి ట్రిపుల్ సెంచరీతో ఇరగదీశాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో రిజ్వి 266 బంతులు ఎదుర్కొని 33 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 312 పరుగులు చేశాడు. రిజ్వి ట్రిపుల్ సెంచరీతో విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ అతి భారీ స్కోర్ చేసింది. 147 ఓవర్ల అనంతరం ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 719 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. రిజ్వికి జతగా రితురాజ్ శర్మ (132) సెంచరీతో కదంతొక్కాడు. స్వస్తిక్ (57), సిద్దార్థ్ యాదవ్ (84) అర్దసెంచరీలతో రాణించారు. విప్రాజ్ నిగమ్ (19), ఆకిబ్ ఖాన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఆదిత్యసిన్హ్ జడేజా 5 వికెట్లు పడగొట్టగా.. నీల్ పాండ్యా 2, గజ్జర్ సమ్మార్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రెండో రోజు ఆట కొనసాగుతుంది. మిగతా మూడు క్వార్టర్ ఫైనల్స్ విషయానికొస్తే.. రెండో క్వార్టర్ ఫైనల్లో విదర్భ, తమిళనాడు.. మూడో క్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్, కర్ణాటక.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో రైల్వేస్, ముంబై జట్లు తలపడుతున్నాయి. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ.. మోఖడే (151), మహళే (117) సెంచరీలతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 380 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేసి ఆలౌటైంది. ప్రకార్ చతుర్వేది (147), స్మరణ్ (106) సెంచరీలతో చెలరేగారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ రెండో రోజు టీ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ముంబైతో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసి రైల్వేస్ 165 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు సింగ్ ఏడు వికెట్లు తీసి రైల్వేస్ పతనాన్ని శాశించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. దివ్యాంశ్ సక్సేనా సెంచరీతో (104) రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. జాక్‌పాట్ కొట్టిన సమీర్ రిజ్వి.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వి ఐపీఎల్ 2024 వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. 20 ఏళ్ల రిజ్విని చెన్నై సూపర్ కింగ్స్ 8.4 కోట్ల రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఐపీఎల్లో ఓ అన్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌కు లభించిన అత్యధిక ధర ఇదే. ఈ వేలంలో రిజ్వి కోసం గుజరాత్ టైటాన్స్ సైతం తీవ్రంగా ప్రయత్నించింది. కుడి చేతి వాటం డాషింగ్ బ్యాటర్ అయిన రిజ్వి.. యూపీ టీ20 లీగ్‌లో మెరుపు శతకం బాదడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. -
6 బంతుల్లో 6 సిక్స్‌లు.. యువీని గుర్తు చేశాడుగా! వీడియో వైరల్
కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్ -23 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర ఓపెనర్ మామిడి వంశీ కృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో వంశీ ఈ ఫీట్ నమోదు చేశాడు. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన 10వ ఓవర్లో వరుసగా 6 సిక్స్‌లు బాది వంశీ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 64 బంతులు ఎదుర్కొన్న వంశీ కృష్ణ 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా బీసీసీఐ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మూడో బ్యాటర్‌గా.. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా కృష్ణ నిలిచాడు. అతడి కంటే ముందు రవి శాస్త్రి, రుతురాజ్ గైక్వాడ్ భారత్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం భారత తరపున దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒక్కడే 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. టీ20 వరల్డ్‌కప్-2007లో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ వరుసగా 6 సిక్స్‌లు బాదాడు. మ్యాచ్ డ్రా.. ఇక ఆంధ్ర-రైల్వేస్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడంతో మ్యాచ్ డ్రా అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రైల్వేస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 865 పరుగుల భారీ స్కోరు సాధించింది. యాన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలతో చెలరేగారు. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడంతో మ్యాచ్ చివరిలో డ్రాగా ముగుస్తుంది. అన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలు, అంచిత్ యాదవ్ (133) సెంచరీలతో రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 865 పరుగుల భారీ స్కోరు సాధించింది. 𝟔 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 𝐀𝐥𝐞𝐫𝐭! 🚨 Vamshhi Krrishna of Andhra hit 6 sixes in an over off Railways spinner Damandeep Singh on his way to a blistering 64-ball 110 in the Col C K Nayudu Trophy in Kadapa. Relive 📽️ those monstrous hits 🔽@IDFCFIRSTBank | #CKNayudu pic.twitter.com/MTlQWqUuKP — BCCI Domestic (@BCCIdomestic) February 21, 2024 -
హైదరాబాద్‌కు తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్–23 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ గెలుపు రుచి చూసింది. స్థానిక జింఖానా మైదానంలో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 41 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో ఆరు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలై మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ (7 పాయింట్లు) ఆరో స్థానానికి చేరింది. 179 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 35/3తో ఆటకు చివరిరోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రాజస్తాన్ 36 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఏబీ కూక్నా (45 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్లలో కృష్ణ చరిత్ 3 వికెట్లు పడగొట్టగా... రక్షణ్, ప్రణీత్ రాజ్, అజయ్‌దేవ్ గౌడ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. రతన్ తేజ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 241 పరుగులు చేయగా... రాజస్తాన్ 237కు ఆలౌటైంది. హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసింది. ఒంగోల్ వేదికగా ఫిబ్రవరి 6 నుంచి జరిగే తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. -
హైదరాబాద్ బౌలర్ల జోరు
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ బౌలర్లు ఆకట్టుకున్నారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జార్ఖండ్‌తో బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో రాజమణి ప్రసాద్ (3/53), కార్తికేయ (3/36), అబ్దుల్ ఖురేషి (3/30) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 47 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రాహిల్ రియాజ్ ఖాన్ (50; 9 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా, అమర్దీప్ సింగ్ (39; 5 ఫోర్లు) రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్ ఆటముగిసే సమయానికి 41 ఓవర్లలో వికెట్నష్టానికి 110 పరుగులతో నిలిచింది. తిలక్ వర్మ (128 బంతుల్లో 63 బ్యాటింగ్; 10 ఫోర్లు), శశిధర్ రెడ్డి (76 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. -
శశిధర్, నితీశ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ అండర్–23 క్రికెట్ టోర్నమెంట్లో తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో కుదురుకుంది. ఓపెనర్లు కె. నితీశ్ రెడ్డి (316 బంతుల్లో 123 బ్యాటింగ్; 17 ఫోర్లు), జీఏ శశిధర్ రెడ్డి (306 బంతుల్లో 132; 15 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత సెంచరీలతో ఆకట్టుకోవడంతో జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 52/0తో ఆట మూడో రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ ఆటముగిసే సమయానికి 107 ఓవర్లలో 3 వికెట్లకు 290 పరుగులతో నిలిచింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ నితీశ్ రెడ్డి, శశిధర్ రెడ్డి ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో హైదరాబాద్ ప్రస్తుతానికి 220 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 261 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత ఆదిత్య బౌలింగ్‌లో శశిధర్ రెడ్డి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన అభిరత్ రెడ్డి (11), విఠల్ అనురాగ్ (1) విఫలమయ్యారు. ప్రస్తుతం నితీశ్ రెడ్డితో పాటు చందన్ సహాని (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఆదిత్య 3 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 65.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. చందన్ సహాని (71; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. శశిధర్ రెడ్డి (47; 6 ఫోర్లు, 1 సిక్స్), విఠల్ (32; 6 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎంబీ దర్శన్ 7 వికెట్లతో చెలరేగాడు. అనంతరం కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 82.4 ఓవర్లలో 249 పరుగులు చేసింది. దీంతో కర్ణాటకకు 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. కిషన్ (73; 10 ఫోర్లు), ఆదిత్య (53; 6 ఫోర్లు), కెప్టెన్ నికిన్ జోష్ (49; 7 ఫోర్లు) ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ 8 వికెట్లతో ప్రత్యర్థి పనిపట్టాడు. రాజమణి ప్రసాద్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. నేడు ఆటకు చివరి రోజు. -
మచిలీపట్నంలో టీమిండియా మాజీ క్రికెటర్
సాక్షి, మచిలీపట్నం : ప్రముఖ క్రికెటర్, టీం ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కృష్ణా జిల్లాకు వచ్చేశారు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా సేవలందించిన తెలుగు తేజం సీకే నాయుడు విగ్రహాన్ని స్పిన్ దిగ్గజం కుంబ్లే మచిలీపట్నం (బందరు)లో ఆవిష్కరించారు. ఉదయం 9.30 గంటలకు మూడు స్తంభాల సెంటర్ దగ్గర కుంబ్లేకు క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి గోసంగం వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత 10 గంటలకు స్టేడియం నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. గోసంగం నుంచి ర్యాలీగా బయలు దేరి నేషనల్ కాలేజ్, రాజుపేట, కోనేరుసెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్ సెంటర్ మీదుగా జెడ్పీ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ టీమిండియా మాజీ కెప్టెన్ సీకే నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. నాయుడు టీమిండియాకు విశేష సేవలందించారని స్పిన్ దిగ్గజం కుంబ్లే కొనియాడారు. తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కుంబ్లే తెలిపారు. 1932–34 మధ్య కాలంలో ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్‌గా ఏపీ (బందరు)కి చెందిన సీకే నాయుడు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సీకే నాయుడు విగ్రహం -
క్వార్టర్స్‌కు హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్– 23 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. ప్లేట్ గ్రూప్ ‘బి’ సెమీఫైనల్ మ్యాచ్‌లో భాగంగా జింఖానా మైదానంలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రా చేసుకుంది. దీంతో హైదరాబాద్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 2 గెలిచి, 3 డ్రా చేసుకుని 21 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆలిండియా నాకౌట్ దశకు అర్హత సాధించిన హైదరాబాద్ జట్టు సభ్యులకు రూ. 50 వేల చొప్పున నగదు పురస్కారాన్ని అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆట చివరిరోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 271/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర 137.5 ఓవర్లలో 462 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్‌కు 202 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ యశ్ పరేఖ్ (73; 11 ఫోర్లు, 1 సిక్స్), పార్థ్ చౌహాన్ (50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లతో పాటు యువరాజ్ (73 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ 4 వికెట్లతో చెలరేగగా, వై. శ్రవణ్ కుమార్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్ మ్యాచ్ ముగిసే సమయానికి 21.5 ఓవర్లలో 2 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఓపెనర్ కె. నితీశ్‌రెడ్డి (69 బంతుల్లో 55; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), చందన్ సహాని (49 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 664 పరుగులకు ఆలౌటైంది. ఈనెల 29 నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడుతో హైదరాబాద్ తలపడుతుంది. -
హైదరాబాద్ మ్యాచ్ డ్రా
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్–23 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్ చివరి రోజు మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మెన్ పోరాడటంతో హైదరాబాద్‌కు ‘డ్రా’ తప్పలేదు. బుధవారం 213/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 90.3 ఓవర్లలో 4 వికెట్లకు 325 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జీవీ వినీత్ రెడ్డి (83; 7 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బుద్ధి రాహుల్ (81; 10 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 376 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్‌కు నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మధ్యప్రదేశ్ ఆటముగిసే సమయానికి 68.1 ఓవర్లలో 5 వికెట్లకు 274 పరుగులతో నిలిచింది. సల్మాన్ ఖాన్ (102 నాటౌట్; 9 ఫోర్లు) అజేయ శతకంతో రాణించడంతో పాటు, చందన్ సింగ్ గిల్ (74; 10 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 2, కె. నితీశ్ రెడ్డి, మీర్ ఒమర్ ఖాన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులు సాధించగా, మధ్యప్రదేశ్ 227 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన హైదరాబాద్‌కు 3 పాయింట్లు, మధ్యప్రదేశ్‌కు ఒక పాయింట్ లభించాయి. ఆదివారం నుంచి జరిగే తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్, జార్ఖండ్‌తో తలపడుతుంది. -
ఆపండి...ఈ మ్యాచ్ జరగడానికి వీల్లేదు!
సాక్షి, గుంటూరు: క్రికెట్ మైదానంలో ఇదో అనూహ్య ఘటన... నేరుగా కోర్టు ఉత్తర్వులు పట్టుకొని అధికారులు మైదానంలోకి రావడం, అప్పటికప్పుడు మ్యాచ్ నిలిపివేస్తూ ఆదేశించడం... ఏ స్థాయిలోనూ ఎప్పుడూ జరగనిది! గుంటూరు శివార్లలోని పేరిచర్ల క్రికెట్ స్టేడియంలో జమ్మూ కశ్మీర్, గోవా జట్ల మధ్య జరుగుతున్న అండర్–23 మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలతో బీసీసీఐ అధికారిక టోర్నీ కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్‌ను ఉన్నపళంగా నిలిపివేయడం ఆటగాళ్లకు షాక్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ జట్టులో ఒక ఆటగాడి ఎంపికకు సంబంధించిన వివాదమే ఇందుకు కారణం. సీకే నాయుడు ట్రోఫీ కోసం ఇటీవల జమ్మూ కశ్మీర్ జట్టు ఎంపిక జరిగింది. అయితే సెలక్షన్ ట్రయల్స్‌లో, అంతకుముందు టోర్నీలలో కూడా తన ప్రదర్శన బాగున్నా తనను ఎంపిక చేయలేదని హిషామ్ సలీమ్ అనే కుర్రాడు కోర్టుకెక్కాడు. పైగా సెలక్టర్లలో ఒకరైన మన్సూర్ అహ్మద్ తన కొడుకు మోమిన్ మన్సూర్‌కు చోటిచ్చాడని అతను పిటిషన్ వేశాడు. హిషామ్ తండ్రి కశ్మీర్ వైద్య శాఖలో డైరెక్టర్‌గా ఉన్నతాధికారి హోదాలో పని చేస్తుండటంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జట్టును ప్రకటించవద్దంటూ కోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే జమ్మూ కశ్మీర్ క్రికెట్ సంఘం 16 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసి మ్యాచ్ ఆడేందుకు గుంటూరుకు పంపించింది. ఆదివారం పేరిచర్లలోని ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో కశ్మీర్, గోవా నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కశ్మీర్ ఫీల్డింగ్ ఎంచుకోగా 13 ఓవర్లలో గోవా వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. అయితే సరిగ్గా ఆ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాదులు జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఆదేశాలతో వచ్చారు. దాని ప్రతిని వారు మ్యాచ్ రిఫరీకి అందజేశారు. మ్యాచ్‌ను కొనసాగిస్తే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కిందకు వస్తుందని భావించిన రిఫరీ సుహైల్ అన్సారీ మ్యాచ్‌ను నిలిపేశారు. ఆ తర్వాత సోమ, మంగళవారాలు కూడా ఈ విషయంపై మరింత స్పష్టత తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రయత్నించినా లాభం లేకపోయింది. దాంతో వరుసగా మూడో రోజు కూడా మ్యాచ్ జరగలేదు. అయితే ఒక్కరి కోసం మ్యాచ్‌ను మధ్యలో ఆపేయడం దురదృష్టకరమన్న కశ్మీర్ అధికారులు... ఇకపై ఎంపిక కాని ప్రతీ ఆటగాడు కోర్టును ఆశ్రయించే చెడు సాంప్రదాయానికి ఇది దారి తీస్తుందని అన్నారు. -
10 వికెట్లూ ఒక్కడికే...
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. సీకే నాయుడు ట్రోఫీ (బీసీసీఐ అండర్-25 మీట్)లో రైల్వేస్ పేసర్ కరణ్ ఠాకూర్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. వడోదరాలో బరోడాతో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. 23 ఏళ్ల ఈ ఢిల్లీ ప్లేయర్ మొత్తం 28.5 ఓవర్లు వేసి 77 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో రైల్వేస్ జట్టు 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకుంటున్న ఠాకూర్.... ఆసీస్ బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. ‘అకాడమీలో రెండుసార్లు మెక్‌గ్రాత్ సర్‌తో మాట్లాడా. ఇది అదృష్టంగా భావిస్తున్నా. బౌలింగ్‌లో విలువ కట్టలేని ఎన్నో మెలకువలను నేర్పాడు. అవుట్ స్వింగర్లు వేయడం నా బలం. ఈ ఘనత అందుకున్నందుకు గర్వంగా ఉంది. అయితే మా జట్టు గెలిస్తే బాగుండేది. శుక్రవారమే ఐదు వికెట్లు తీశా. అయితే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీస్తానని మాత్రం అనుకోలేదు. 8వ వికెట్ తీసినప్పుడు దీని గురించి ఆలోచన కలిగింది. చివరకు 10వ వికెట్ తీసినప్పుడు గొప్ప అనుభూతి అనిపించింది. అంపైర్లు మ్యాచ్ బంతితో పాటు సావనీర్‌ను అందజేశారు. వీటిని భద్రంగా దాచుకుంటా’ అని కరణ్ తెలిపాడు. రైల్వేలో ఉద్యోగం న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజిలో బీఏ చదువుతున్న కరణ్.. ఇండియన్ రైల్వేస్‌లో పూర్తిస్థాయి ఉద్యోగి. ‘రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యా. కానీ దాని గురించి ఇప్పుడే ఆలోచించడం బాగుండదు. రంజీ ట్రోఫీలో ఆడటం నా కల. నేను ఆడుతున్న మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడం నా కర్తవ్యం’ అని ఈ యువ బౌలర్ వ్యాఖ్యానించాడు. కరణ్ ప్రదర్శన పట్ల రైల్వేస్ చీఫ్ కోచ్ అభయ్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లు జిమ్ లేకర్ (ఇంగ్లండ్), అనిల్ కుంబ్లే (భారత్) ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 79 మంది ఈ ఘనత సాధించారు. భారత్‌లో పి.ఎం.చటర్జీ, దేబాశిష్ మొహంతి, ఎస్.పి.గుప్తే, పి.సుందరం... ఈ నలుగురూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇన్నింగ్స్‌లో పది వికెట్ల తీశారు. -
పదికి పది వికెట్లు.. రైల్వేస్ బౌలర్ రికార్డు
రైల్వేస్ బౌలర్ కరణ్ ఠాకూర్ సీకే నాయుడు ట్రోఫీ (బీసీసీఐ అండర్-25)లో రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం పదివికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కరణ్ ఘనత సాధించాడు. వడోదరలోని రిలయన్స్ స్టేడియంలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో కరణ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల యువ పేసర్ కరణ్ సీకే నాయుడు ట్రోఫీలో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బరోడాపై కరణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 28.5-5-77-10 గణాంకాలు నమోదు చేశాడు. కరణ్ ఆస్ట్రేలియా పేస్ లెజెండ్ మెక్‌గ్రాత్ వద్ద బౌలింగ్ మెళకువలు నేర్చుకున్నాడు. అవుట్ స్వింగర్లే తన బౌలింగ్ బలమని కరణ్ చెప్పాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ చెత్తగా ఆడటంతో రైల్వేస్ పది వికెట్లతో ఓటమి చవిచూసింది.