కల్నల్ సికె నాయుడు ట్రోఫీ-2024లో హర్యానా ఓపెనర్ యశ్వర్ధన్ దలాల్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా గుర్‌గ్రామ్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో యశ్వర్ధన్ ఏకంగా క్వాడ్రపుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై బౌలర్లను యశ్వర్ధన్ ఊచకోత కోశాడు.
వన్డే తరహాలో ఈ హర్యానా బ్యాటర్ విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా 463 బంతులు ఎదుర్కొన్న యశ్వర్ధన్ దలాల్ 46 ఫోర్లు, 12 సిక్స్‌లతో 426 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ అర్ష్ రంగతో కలిసి యశ్వర్ధన్ 410 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అర్ష్ రంగ(151) కూడా సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 748 పరుగుల భారీ స్కోరును సాధించింది.
తొలి ప్లేయర్‌గా..
ఇక ఈ మ్యాచ్‌లో క్వాడ్రపుల్ సెంచరీతో మెరిసిన యశ్వర్ధన్ పలు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కల్నల్ సికె నాయుడు ట్రోఫీలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా యశ్వర్ధన్ దలాల్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఉత్తరప్రదేశ్ స్టార్ ప్లేయర్ సమీర్ రిజ్వీ పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌరాష్ట్రపై సమీర్ రిజ్వీ(312) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో రిజ్వీ ఆల్‌టైమ్ రికార్డును యశ్వర్ధన్ బ్రేక్ చేశాడు.
చదవండి: ENG vs WI: సాల్ట్ విధ్వంసకర సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
Comments
Please login to add a commentAdd a comment