IPL 2022 New Rules Change: BCCI Introduces Multiple DRS And Covid-19 Allowances - Sakshi
Sakshi News home page

IPL 2022 Rule Changes: ఐపీఎల్‌లో సరికొత్త రూల్స్‌.. ఇకపై!

Published Tue, Mar 15 2022 9:12 PM | Last Updated on Wed, Mar 16 2022 9:22 AM

 BCCI Introduces Multiple DRS, COVID 19 Allowances - Sakshi

మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్‌ సంగ్రామానికి తెరలేవనుంది.. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వాంఖడే వేదికగా మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫిండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనుంది. ఇది ఇలా ఉంటే.. ఈ ఏడాది సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో సరికొత్త నిబంధనలను బీసీసీఐ  ప్రవేశపెట్టింది. కొత్తగా వచ్చిన రూల్స్‌ ఏంటో ఓ లూక్కేద్దం.

రూల్1:  దైనా జట్టులోని ఆటగాళ్లు కోవిడ్‌ బారిన పడి 12 మంది కంటే తక్కువ మంది ఆటగాళ్లు (వీటిలో కనీసం 7 మంది భారత ఆటగాళ్లు ఉండాలి) అందుబాటులో ఉంటే బీసీసీఐ ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేస్తుంది. ఇక వేళ రీషెడ్యూల్ చేయడం సాధ్యం కాకపోతే, ఐపీఎల్ టెక్నికల్‌ టీం దృష్టికి తీసుకెళతారు. టెక్నికల్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.
 
రూల్2: త సీజన్లకు భిన్నంగా ఐపీఎల్‌లో ప్రతి జట్టుకు రెండు రివ్యూలు తీసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ప్రతి జట్టుకు కేవలం ఒక్క రివ్యూ మాత్రమే కోరుకోనే అవకాశం ఉండేది.

రూల్3: మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ తీసుకొచ్చిన కొత్త నిబంధనను కూడా ఐపీఎల్‌లో కూడా అమలు చేయనున్నారు. బ్యాటర్‌ క్యాచ్‌ అవుట్ అయిన తర్వాత.. క్రీజులోకి వచ్చే బ్యాటర్‌ స్ట్రైక్ తీసుకుంటాడు. ఓవర్ ఆఖరి బంతికి ఔట్ అయితే ఈ నిబంధన వర్తించదు.

రూల్4: ప్లేఆఫ్స్‌ లేదా ఫైనల్‌ మ్యాచ్‌లో  ఏదైనా ఫలితం తేలకుండా టైగా మారితే సూపర్‌ ఓవర్‌ నిర్వహిస్తారు. సూపర్‌ ఓవర్‌కు వీలుకాకుంటే లీగ్ స్టేజ్ లో పాయింట్ల ఆధారంగా  విజేతగా ప్రకటిస్తారు.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో తెలుగోళ్లు... తొలి సారిగా అంపైర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement