
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. సీఎస్‌కే ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో డానియల్ సామ్స్ వేసిన రెండో బంతి.. స్ట్రైక్‌లో ఉన్న డెవాన్ కాన్వే ప్యాడ్‌ను తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకు అప్పీలు చేయగా.. అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు.
అయితే ఆశ్చర్యకరంగా వాంఖడే స్టేడియంలో పవర్ కట్ కారణంగా.. కాన్వేకు రివ్యూ తీసుకునే అవకాశం దక్కలేదు. కాన్వే తన భాగస్వామి రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి అంపైర్‌లతో మాట్లాడాడు. కానీ అంపైర్‌లు మాత్రం ఔట్‌గానే నిర్ధారించారు. దీంతో డకౌట్‌గా కాన్వే వెనుదిరిగాడు. అయితే బంతి క్లియర్‌గా లెగ్ స్టంప్‌ను మిస్ అవుతున్నట్లు అన్పించింది. ఇక సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా స్టేడియంలో పవర్ కట్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు.
చదవండి: Brendon McCullum: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్..
— Cred Bounty (@credbounty) May 12, 2022