అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాకు ఆస్ట్రేలియా గట్టి సవాలు విసురుతుంది. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా(180), గ్రీన్(114) అద్భుత సెంచరీలతో అదరగొట్టారు. కాగా 255/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ వికెట్లను పడగొట్టడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.
ఖవాజా, గ్రీన్‌ల మధ్య ఏర్పడిన 208 పరుగుల భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు అశ్విన్ బ్రేక్ చేశాడు. అద్భుత శతకంతో చెలరేగిన గ్రీన్‌ను ఔట్ చేసిన అశ్విన్ టీమిండియాను ఊపిరి పీల్చుకోనేలా చేశాడు. అనంతరం అదే ఓవర్‌లో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ క్యారీని డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు.
అదే విధంగా డబుల్‌సెంచరీకి దగ్గరగా వెళ్తున్న ఉస్మాన్ ఖవాజాను మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఆస్ట్రేలియా టాయిలాండర్లు నాథన్ లియాన్, టాడ్ ముర్ఫీ కలిసి 9వ వికెట్‌కి 70 పరుగులు జోడించి భారత బౌలర్లను విసిగించారు. ఆఖరిలో అశ్విన్ మరో రెండు వికెట్లు సాధించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 6 వికెట్లతో రాణించాడు.
టీమిండియా చెత్త రివ్యూ..
ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా ఓ చెత్త రివ్యూ తీసుకుని నవ్వుల పాలు అయింది. ఆసీస్ ఇన్నింగ్స్ 128వ వేసిన జడేజా బౌలింగ్‌లో ఆఖరి బంతిని ఉస్మాన్ ఖవాజా ఆఫ్‌సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది.
దీంతో ఖవాజాను ఎలాగైనా ఔట్ చేయాలన్న పట్టుదలతో కనిపించిన జడ్డూ ఎల్బీగా అప్పీల్ చేశాడు. వెంటనే ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో నాటౌట్ అంటూ తల ఊపాడు. అయితే బంతి ఆఫ్ స్టంప్ కు చాలా బయట ఖవాజా ప్యాడ్‌కు తాకినట్లు కన్పించింది. అయినప్పటకీ జడేజా మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మపై ఒత్తడి తెచ్చి డీఆర్ఎస్ తీసుకునేలా చేశాడు.
అయితే రీప్లే చూశాక రోహిత్, జడ్డూకు దిమ్మతిరిగింది. రీప్లేల్లో చూస్తే బంతి ఆఫ్ స్టంప్ కు చాలా దూరంగా వెళ్తున్నట్లు తేలింది. దీంతో అంపైర్‌తో సహా భారత ఆటగాళ్లు అంతా ఒక్క సారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ రివ్యూపై కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వ్యంగ్యంగా స్పందించాడు. థర్డ్ అంపైర్ మేల్కొనే ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఈ రివ్యూ భారత జట్టు తీసుకున్నట్లుందని కార్తీక్ చురలకు అంటించాడు. ఇక అభిమానులు అయితే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) March 10, 2023
Comments
Please login to add a commentAdd a comment