
Courtesy: IPL Twitter
KL Rahul Frustration On Field Umpire.. ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. బ్యాటర్ క్లియర్ అవుట్ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అంపైర్ ఔటివ్వకపోవడంతో కెఎల్ రాహుల్ వాదనకు దిగాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ రవి బిష్ణోయి వేశాడు. కాగా ఓవర్ మూడో బంతిని దేవదత్ పడిక్కల్ ఫ్లిక్ చేసే ప్రయత్నంలో అతని చేతిని తాకి బంతి కీపర్ రాహుల్ చేతిలో పడింది. అయితే అంపైర్ నాటౌట్ అని చెప్పడంతో రాహుల్ రివ్యూ కోరాడు. అయితే అల్ట్రాఎడ్జ్‌లో పడిక్కల్ గ్లౌజ్‌ను తాకినట్లు స్పైక్ స్పష్టంగా కనిపించింది. అయినప్పటికి థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఫీల్డ్ అంపైర్‌కు వదిలేశాడు.
చదవండి: ముంబై ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది: షేన్ బాండ్
Courtesy: IPL Twitter
ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పడిక్కల్ నాటౌట్ అని ఇచ్చాడు. ఇది చూసి షాకైన రాహుల్.. ''ఇదేం నిర్ణయం.. బంతి బ్యాటర్ గ్లౌజ్‌కు క్లియర్‌గా తగిలినట్లు అల్ట్రాఎడ్జ్‌లో క్లియర్‌గా కనిపిస్తున్నప్పటికి ఔట్ ఇవ్వకపోవడం ఏంటని'' అసహనం వ్యక్తం చేశాడు. దీంతో పడిక్కల్ బతికిపోగా.. పంజాబ్ రివ్యూ వృధా అయింది. అయితే అంపైర్ నిర్ణయంపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. '' అంత క్లియర్‌గా ఔట్ అని కనిపిస్తున్నా అంపైర్ అలా ఎందుకు చేశాడు.. ఈ అంపైర్‌కు డీఆర్‌ఎస్‌పై స్పెషల్ క్లాసులు పెట్టాల్సిందే'' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే
— Maqbool (@im_maqbool) October 3, 2021