ధర్మశాల: అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన వీడియో ప్రజెంటేషన్‌ను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కు చూపించేం దుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. ఈ నెల 20న న్యూఢిల్లీలో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ముందు ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డిస్ ఈ ప్రజెంటేషన్‌ను చూపించనున్నారు.
అక్కడ వన్డే ఆడేందుకు వెళ్లే భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఈ ప్రజెంటేషన్‌ను తిలకించే అవకాశముంది. కుంబ్లే ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఇందులో పాల్గొననున్నాడు. భారత్ ఎప్పుడు డీఆర్‌ఎస్‌ను వద్దనలేదని దాని పనితీరుపైనే అనుమానాలు వ్యక్తం చేసిందని ఠాకూర్ పేర్కొన్నారు.