Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్ 12 ఓవర్‌లో టి నటరాజన్.. రింకూ సింగ్‌కు అద్భుతమైన యార్కర్ వేశాడు. రింకూ ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ ప్యాడ్‌కు తాకింది. అయితే వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. ఈ క్రమంలో అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు.
అయితే నాన్ స్ట్రెక్‌లో ఉన్న బిల్లింగ్స్, రింకూ చర్చించుకున్న తర్వాత రివ్యూ తీసుకున్నారు. అయితే రివ్యూను ఫీల్డ్ అంపైర్‌లు తిరష్కరించారు. ఎందుకంటే రివ్యూ సిగ్నల్‌ను రింకూ కాకుండా బిల్లింగ్స్ ఇవ్వడమే దీనికి కారణం. డీఆర్‌ఎస్ రూల్స్ ప్రకారం.. బ్యాటర్ స్వయంగా రివ్యూకు సిగ్నల్ ఇవ్వాలి. అయితే బిల్లింగ్స్ సిగ్నల్ ఇవ్వడంతో అంపైర్‌లు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఫీల్డ్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Varma Fan (@VarmaFan1) May 14, 2022
Comments
Please login to add a commentAdd a comment