టీఆర్‌ఎస్ కాదు.. డీఆర్‌ఎస్ పార్టీ.. : జైరాం రమేశ్ | it's not trs, it's drs says jai ram ramesh | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ కాదు.. డీఆర్‌ఎస్ పార్టీ.. : జైరాం రమేశ్

Published Sat, Apr 26 2014 4:01 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

కేసీఆర్ స్థాపించింది తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీ కాదని అది దొరల రాష్ట్ర సమితి(డీఆర్‌ఎస్) పార్టీ అని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అన్నారు.

 సాక్షి, మంచిర్యాల :  కేసీఆర్ స్థాపించింది తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీ కాదని అది దొరల రాష్ట్ర సమితి(డీఆర్‌ఎస్) పార్టీ అని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన  శుక్రవారం జిల్లాలో పర్యటించా రు. బోథ్  రోడ్‌షోలో, ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లి గ్రామంలో, మంచిర్యాల మండలంలోని శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన సభల్లో.. మంచిర్యాలలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏదో ఒక్క కుటుంబానికి న్యాయం చేసేందుకు లేదా ఎవరినో సీఎం చేసేందుకు తాము తెలంగాణకు మద్దతివ్వలేదని స్పష్టం చేశారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్టీని విలీనం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని అన్నారు.

 కేసీఆర్‌ది అడుగడుగునా వంచన గుణం. కేసీఆర్‌లోని కే అంటే వంద, సీఆర్ కోట్లు అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ వల్లే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందనే వాదనలో ఏమాత్రం నిజం లేదు. మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో,  నిరంతరం చేసిన పోరువల్లే రాష్ట్రం సాధ్యమైంది. టీఆర్‌ఎస్‌కు రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా లేకున్నా, బీజేపీ అడ్డుకున్నా తాము తెలంగాణ ఇప్పించాం. టీఆర్‌ఎస్ ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధ్యమయ్యేదా? తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను గుర్తించిన సోనియాగాంధీ తెలంగాణ మాత. సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ నిర్మాణం జరగాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యం. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉంది. రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్‌వే ఉండాలి’అని అన్నారు.

 కేసీఆర్ బీజేపీతో కలుస్తాడు..
 సమయం వచ్చినప్పుడు కే సీఆర్ బీజేపీతో కలుస్తారని జైరాం రమేశ్ విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ సమాజాన్ని చీలిస్తే కాంగ్రెస్ కలుపుతుందన్నారు. ఉద్యోగుల్లో కేసీఆర్ అనవసర సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపిం చారు. హైదరాబాద్‌పై, అక్కడ నివసించే వారిపై కేసీఆర్ సృష్టించిన అనవసర భయాందోళనల వల్లే గవర్నర్ చేతిలో శాంతిభద్రతలు పెట్టాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా పంచర్ అయింది. టీడీపీ, బీజేపీ పార్టీలు ఒకే నాణెంకు ఉన్న రెండు ముఖాలు రాజకీయ లబ్ధి కోసం జత కట్టిన ఆ పార్టీలకు ఇక్కడ మనుగడ లేకుండా చెయ్యాలి’అని సూచించారు.

  చంద్రబాబు ఇంటి పేరు నారా కాదని ఆయన ఇంటి పేరు నరేంద్ర చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌కు సిద్ధంగా ఉంటే ఇంతమంది బలి అయ్యే వరకు ఎందుకు ఆగిపోయారని ప్రశ్నించగా.. తమ మిత్రపక్షాలతో చర్చించడం, ఇతర ప్రక్రియలు పూర్తి చేసేందుకు సమయం తీసుకొందని అన్నారు. హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నందునే సీమాంధ్రకు ప్యాకేజీ ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు.

 ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా దకే ్కం దుకు కావాల్సిన సాంకేతిక అనుమతులను సాధిస్తామని చెప్పారు. మంచిర్యాల కొత్త జిల్లా చేస్తామన్నారు. 8 ఏళ్ల సర్వీసుకు పైబడ్డ కాంట్ట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జైపూర్ విద్యుత్ ప్లాంటును 2015 చివరికల్లా పూర్తిచేస్తామని చెప్పారు. సింగరేణి, డిస్మిస్డ్ కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థు లు జి.వివేక్, జాదవ్ నరేశ్, ఎమ్మెల్యే అభ్యర్థులు గుండా మల్లేశ్, జి.అరవింద్‌రెడ్డి, జి.వినోద్, ఎ.హరినాయక్, ఎమ్మెల్సీ బి.వెంక ట్రావు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 కాంగ్రెస్ గూటికి టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే..
 టీఆర్‌ఎస్ పార్టీకి  చెందిన ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజ్మీరా గోవింద్ నాయక్ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ వల్లే అభివృద్ధి సాధ్యం అన్నారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాల వల్ల ప్రజల అర్థికాభివృద్ధి సాధ్యం అయ్యిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement