
స్వదేశంలో ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఆసీస్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో వైట్‌వాస్ అయిన టీమిండియా.. ఐదు వన్డేల సిరీస్‌లో 3-2 తేడాతో ఓటమి చెందింది. తమ దేశంలో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ దాన్ని సాధించింది. ముందుగా జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.కేఎల్ రాహుల్(50) హాఫ్ సెంచరీ సాధించగా, కోహ్లి(24), ఎంఎస్ ధోని(29 నాటౌట్)లు మోస్తరుగా ఆడారు. అనంతరం ఆసీస్ చివరి బంతికి విజయం సాధించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్(56) అర్థ శతకం సాధించగా, డీఆర్సీ షార్ట్(37) కూడా ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో టీ20లో కూడా భారత్‌కు పరాభవం తప్పలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 190 పరుగులు చేసింది. కోహ్లి(72), రాహుల్ (47), ఎంఎస్ ధోని (40)లు రాణించారు. అనంతరం ఆసీస్ ఇంకా రెండు బంతులు ఉండగానే విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్(113) సెంచరీతో కదం తొక్కగా, డీఆర్సీ షార్ట్(40) రాణించాడు.
తొలి భారత క్రికెటర్‌గా ధోని..
ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ధోని మూడు సిక్సర్లు బాదాడు. దాంతో 352వ సిక్సర్‌ను ధోని సాధించాడు. ఈ క్రమంలోనే 350 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా ధోని గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్సర్ల మార్కును ధోని చేరాడు. అప్పటికి రోహిత్ శర్మ 349 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో క్రిస్ గేల్(534 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉండగ, షాహిద్ ఆఫ్రిది (476 సిక్సర్లు) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ(409) మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని కొట్టిన సిక్సర్లు 359.
‘వంద’లో సున్నా..!
తొలి వన్డేలోఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ మూడు బంతులు ఆడిన ఫించ్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు.ఇది ఫించ్‌కు వందో వన్డే. ఈ మ్యాచ్‌లో ఫించ్ డకౌట్‌గా నిష్క్రమించడంతో ఆసీస్ తరఫున ఇలా వందో మ్యాచ్‌లో సున్నాకే ఔటైన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు డీన్ జోన్స్, క్రెయిగ్ మెక్‌డెర్మట్‌లు వందో వన్డేలో డకౌట్‌గా ఔటైన ఆసీస్ క్రికెటర్లు. వారి సరసర ఫించ్ చేరాడు.
మరో ‘సెంచరీ’ కొట్టేశారు..!
ఆస్ట్రేలియాతో నాల్గో వన్డేలో రోహిత్-ధావన్‌ల జంట సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. దాంతో వన్డే ఫార్మాట్‌లో 15వ సారి సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించినట్లయ్యింది. అదే సమయంలో వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల నమోదు చేసిన ఓపెనింగ్ జోడిల్లో గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ సరసన రోహిత్-ధావన్‌ల జంట నిలిచింది. వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల నమోదు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ(21 సెంచరీ భాగస్వామ్యాలు) తొలిస్థానంలో ఉంది.ప్రస్తుతం
రోహిత్-ధావన్‌ల జోడి మరో ఘనత
టీమిండియా తరఫున వన్డేల్లో ఓవరాల్‌గా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జాబితాలో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌ల జోడి రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియాతో నాల్గో వన్డేలో ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్-ధావన్‌ల జంట.. సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీల జోడి తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్(4,387 పరుగులు) జోడిని వెనక్కినెట్టింది.
డీఆర్‌ఎస్ వివాదాలు..
ఆసీస్‌తో రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో హాక్‌ఐ టెక్నాలజీ పని చేసే తీరు వివాదాస్పదంగా మారింది. కుల్దీప్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ ఎల్బీగా ఔటయ్యాడు. దానిపై డీఆర్‌ఎస్‌కు వెళ్లిన ఫించ్‌కు వ్యతిరేక నిర్ణయమే వచ్చింది. కుల్దీప్ వేసిన ఆ బంతిని ట్రాక్ చేయడానికి ఉపయోగించిన హాక్‌ఐ టెక్నాలజీ చర‍్చనీయాంశమైంది. ఆ బంతి పిచ్ అయ్యే క్రమంలో మిడిల్ స్టంప్ నుంచి మిడిల్ వికెట్‌ను గిరాటేస్తుండగా, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో మాత్రం అది లెగ్ స్టంప్‌లో పడి మిడిల్ స్టంప్‌కు వెళుతున్నట్లు కనిపించింది. దాంతో డీఆర్‌ఎస్‌లో ఇంకా లోపాలు ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది.
అంతకుముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సైతం ఇదే తరహా వివాదం నెలకొంది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మిచెల్ ఎల్బీగా వెనుదిరిగిన తీరు అనేక సందేహాలకు చోటిచ్చింది. బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్ కనిపించలేదు. దాంతో బాల్ ట్రాకింగ్ ఆధారంగా థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment