ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్ 35 బంతుల్లో 85, ఏడు ఫోర్లు. ఆరు సిక్సర్లు తన ఐపీఎల్ కెరీర్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడగా.. నెహాల్ వదేరా 34 బంతుల్లో 52 నాటౌట్ యాంకర్ రోల్ పాత్ర పోషించాడు. అంతకముందు ఇషాన్ కిషన్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్‌కుమార్ వైశాక్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.
సూర్యకుమార్ అర్థశతకం.. ముంబై 174/2
సూర్యకుమార్ తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో సూర్య అర్థశతకంతో మెరిశాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సూర్యకుమార్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. నెహాల్ వదేరా 44 పరుగులతో ఆడుతున్నాడు.
10 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 99/2
10 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సూర్యకుమార్ 18, వదేరా 25 పరుగులుతో ఆడుతున్నారు.
టార్గెట్ 200.. ముంబై ఇండియన్స్ 62/2
200 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. నెహాల్ వదేరా 6, సూర్యకుమార్ రెండు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు రోహిత్(7 పరుగులు), ఇషాన్ కిషన్(41 పరుగులు)హసరంగా బౌలింగ్‌లోనే వెనుదిరిగారు.
Photo Credit : IPL Website
ముంబై ఇండియన్స్ టార్గెట్ 200
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ 68, డుప్లెసిస్ 65 పరుగులతో రాణించగా.. ఆఖర్లో కార్తిక్ 18 బంతుల్లో 30 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్‌సీబీ 199 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లో జాసన్ బెహండార్ఫ్ మూడు వికెట్లు తీయగా.. కుమార్ కార్తికేయ, జోర్డాన్, గ్రీన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
18 ఓవర్లలో ఆర్‌సీబీ 185/5
18 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ 17 బంతుల్లో 30, కేదార్ జాదవ్ 10 పరుగులతో ఆడుతున్నారు.
Photo Credit : IPL Website
14 ఓవర్లలో ఆర్‌సీబీ 146/4
ఒక్క పరుగు మాత్రమే చేసిన లామ్రోర్ కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ఆర్‌సీబీ నాలుగో వికెట్ నష్టపోయింది.ప్రస్తుతం ఆర్‌సీబీ 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. డుప్లెసిస్ 65 పరుగులు, దినేశ్ కార్తిక్ ఒక్క పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు 33 బంతుల్లో 68 పరుగులతో విధ్వంసం సృష్టించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఔట్ కావడంతో ఆర్‌సీబీ మూడో వికెట్ కోల్పోయింది. బెహండార్ఫ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మ్యాక్సీ.. నెహాల్ వదేరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Photo Credit : IPL Website
మ్యాక్స్‌వెల్ ఫిఫ్టీ.. ఆర్‌సీబీ 104/2
ఆర్‌సీబీ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అర్థసెంచరీతో మెరిశాడు. 25 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అతని ధాటికి ఆర్‌సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. డుప్లెసిస్ 44 పరుగులతో ఆడుతున్నాడు.
Photo Credit : IPL Website
6 ఓవర్లలో ఆర్‌సీబీ 56/2
ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. డుప్లెసిస్ 26, మ్యాక్స్‌వెల్ 23 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆరు పరుగులు చేసిన అనూజ్ రావత్ బెహండార్ఫ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
Photo Credit : IPL Website
తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లి బెహండార్ఫ్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం ముంబై వేదికగా 54వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
Hitman wins the toss at Wankhede & asks the King to bat first 😎
Stream #MIvRCB LIVE & FREE with #IPLonJioCinema for any sim card!#TATAIPL #IPL2023 #RohitSharma #ViratKohli | @mipaltan @RCBTweets @imVkohli @ImRo45 pic.twitter.com/1A2wP5mf00
— JioCinema (@JioCinema) May 9, 2023
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్
ఈ సీజన్‌లో ఇరుజట్లు 10 మ్యాచ్‌ల్లో చెరో ఐదు విజయాలతో ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉన్పాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్-5లో నిలిచే అవకాశం ఉంది. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న తిలక్ వర్మ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment