ఐపీఎల్ 16వ సీజన్‌ను ఆర్‌సీబీ ఘనంగా ఆరంభించింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే చేధించింది. కోహ్లి(49 బంతుల్లో 82 నాటౌట్), డుప్లెసిస్( 43 బంతుల్లో 73) తొలి వికెట్‌కు 148 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో డుప్లెసిస్ ఔటైనప్పటికి కోహ్లి మిగతాపనిని పూర్తి చేశాడు.
కోహ్లి, డుప్లెసిస్ అర్థ శతకాలు.. విజయం దిశగా ఆర్‌సీబీ
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం దిశగా పయనిస్తోంది. కోహ్లి, డుప్లెసిస్‌లు అర్థశతకాలతో విరుచుకుపడడంతో ఆర్‌సీబీ ప్రస్తుతం 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది. ఆర్‌సీబీ విజయానికి 48 బంతుల్లో 59 పరుగులు కావాలి.
9 ఓవర్లు ముగిసరికి ఆర్‌సీబీ వికెట్ నష్టోకుండా 80 పరుగులు చేసింది. డుప్లెసిస్ 44, కోహ్లి 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టార్గెట్ 172.. ధాటిగా ఆడుతున్న ఆర్‌సీబీ
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ దూకుడు కనబరుస్తోంది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. డుప్లెసిస్ 26, కోహ్లి 22 పరుగులతో ఆడుతున్నారు.
ఆర్‌సీబీ టార్గెట్ 172
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. తిలక్ వర్మ 46 బంతుల్లో 84 పరుగులు నాటౌట్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. 17 ఓవర్లలో ముంబై 123/7
కష్టాల్లో పడిన ముంబై ఇండియన్స్‌ను తెలుగుతేజం తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీతో నిలబెట్టాడు. ప్రస్తుతం ముంబై 17 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. తిలక్ వర్మ 59, అర్షద్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
14 ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసిసంది. తిలక్ వర్మ 44 పరుగులతో ఆడుతున్నాడు.
సూర్యకుమార్ ఔట్.. 48కే నాలుగు వికెట్లు
సూర్యకుమార్(16) రూపంలో ముంబై ఇండియన్స్ 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
రోహిత్ ఔట్.. మూడో వికెట్ డౌన్
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు 10 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను సిరాజ్ ఔట్ చేస్తే.. 5 పరుగులు చేసిన గ్రీన్‌ను టోప్లే పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ముంబై ఐదు మూడు వికెట్ల నష్టానికి 19 పరుగులతో ఉంది.
టాస్ గెలిచిన ఆర్‌సీబీ
ఐపీఎల్ ఐదో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ బౌలింగ్ తీసుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. సొంత గడ్డపై విజయం సాధించాలని డూప్లెసిస్ సేన పట్టుదలతో ఉంది. విక్టరీతో టోర్నీ ప్రారంభించాలని రోహిత్ సేన భావిస్తోంది.
ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వదేరా, హృతీక్ షోకీన్, పియూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లిసెస్ (కెప్టెన్), మైకేల్ బ్రాస్‌వెల్, షాబజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, రేస్ తోప్లే, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment