IPL: Sanju Samson Continued Good Record Vs SRH Last 10 Matches-541 Runs - Sakshi
Sakshi News home page

# Justice For Sanju Samson: ఇంతలా చెలరేగుతున్నా మనసు కరగడం లేదా!

Published Sun, Apr 2 2023 5:36 PM | Last Updated on Sun, Apr 2 2023 6:25 PM

Sanju Samson Continued Good Record Vs SRH Last 10 Matches-541 Runs - Sakshi

సంజూ శాంసన్‌లో ఎంత టాలెంట్‌ దాగుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చినవాళ్లలో శాంసన్‌ కూడా ఒకడు. అయితే ఎన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన టీమిండియాలో మాత్రం స్థానం దొరకడం లేదు. ఒకవేళ అవకాశం లభించినా తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారేది. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్ల స్థానంలో శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని.. అనవసరంగా టాలెంట్‌ను తొక్కేస్తున్నారంటూ  ఫ్యాన్స్‌ మండిపడేవారు. తాజాగా శాంసన్‌ మరోసారి చెలరేగడంతో #Justice For Samson తెరపైకి వచ్చింది. ఇంతలా చెలరేగుతున్నా మనసు కరగడం లేదా అంటూ కామెంట్‌ చేశారు.

అలాంటి సంజూ శాంసన్‌ తనకు అవకాశాలు రాకపోయినప్పటికి ఐపీఎల్‌ ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. గతేడాది కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌ అయిన సంజూ శాంసన్‌ జట్టును రన్నరప్‌గా నిలిపాడు. ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టాలన్న కసితో బరిలోకి దిగిన శాంసన్‌ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆదివారం మ్యాచ్‌లో అర్థసెంచరీతో ఆకట్టుకున్న శాంసన్‌ 55 పరుగులు చేసి ఔటయ్యాడు. 

అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ పేరు చెప్పగానే శాంసన్‌ పూనకం వచ్చినవాడిలా చెలరేగిపోతాడు. 2018 నుంచి చూసుకుంటే శాంసన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌పై 10 మ్యాచ్‌లాడి 541 పరుగులు చేశాడు.  ఇక 2020 ఐపీఎల్‌ సీజన్‌ నుంచి చూసుకుంటే ప్రతీ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో సెంచరీ లేదా అర్థసెంచరీ చేయడం విశేషం. 2020 సీజన్‌లో సీఎస్‌కేపై 74 పరుగులు, 2021లో పంజాబ్‌ కింగ్స్‌పై సెంచరీ(63 బంతుల్లో 119 పరుగులు), 2022 ఎస్‌ఆర్‌హెచ్‌పై (27 బంతుల్లో 55 పరుగులు), తాజాగా మళ్లీ ఎస్‌ఆర్‌హెచ్‌పై 2023లో (32 బంతుల్లో 55 పరుగులు) చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement