సంజూ శాంసన్ (Photo Credit: BCCI/IPL)
IPL 2023 GT Vs RR- Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తన బ్యాటింగ్ పవరేంటో మరోసారి నిరూపించాడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్, టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్. ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విధించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ ఆరంభంలోనే తడబాటుకు లోనైంది.
ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(1)ను గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా, జోస్ బట్లర్(0)ను మహ్మద్ షమీ పెవిలియన్‌కు పంపి కోలుకోలేని దెబ్బకొట్టారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(26)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు సంజూ శాంసన్.
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసి
మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో ఏకంగా 60 పరుగులు రాబట్టాడు. ఆఖర్లో షిమ్రన్ హెట్‌మెయిర్ తుపాన్ ఇన్నింగ్స్‌తో అజేయ అర్థ శతకం సాధించడంతో రాజస్తాన్ గెలుపు ఖరారైంది. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్‌ను వారి సొంత మైదానంలోనే మూడు వికెట్ల తేడాతో ఓడించిన రాజస్తాన్ జయకేతనం ఎగురవేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సంజూ ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి ఈ సీజన్‌లో 157 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే.. ఈ కేరళ బ్యాటర్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేశాడు.
ప్రతి రోజూ.. ప్రతి మ్యాచ్‌లో
‘‘నాకే గనుక అవకాశం ఉంటే.. టీమిండియా ఆడే ప్రతీ టీ20 మ్యాచ్‌లోనూ అతడికి ఛాన్స్ ఇస్తా’’ అంటూ ఆకాశానికెత్తాడు. ఈ నేపథ్యంలో.. ‘‘నువ్వు సెలక్టర్‌వి అయితే బాగుండు. కానీ అది జరగని పని కదా! ఏదేమైనా.. టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి నేరుగా ఇచ్చిపడేశావు కదా!’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నిజమే హర్షా భాయ్
ఇక సంజూ అభిమానులైతే.. ‘‘సరిగ్గా చెప్పారు హర్షా భాయ్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సంజూకు తిరుగులేదు. టీమిండియాలో చోటుకు వందకు వంద శాతం అర్హుడు’’ అని పేర్కొంటున్నారు. కాగా ప్రతిభ ఉన్నా సంజూకి అవకాశాలు ఇవ్వడం లేదంటూ బీసీసీఐ సెలక్టర్లపై గతంలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో సంజూ శాంసన్‌ను బీసీసీఐ ‘సీ’ గ్రేడ్(రూ. 1 కోటి)లో చేర్చడం విశేషం. ఇదిలా ఉంటే.. ఎప్పుడో ఓసారి వచ్చిన అవకాశాలను కూడా మిస్ చేసుకుంటాడనే అపవాదు కూడా సంజూపై ఉంది.
చదవండి: అర్జున్ చాలా కష్టపడ్డాడు.. సచిన్ టెండుల్కర్ భావోద్వేగం! వీడియో వైరల్
‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు; అదే అర్జున్ టెండుల్కర్‌ను చూడండి!’
చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్ రాణాకు బీసీసీఐ షాక్! సూర్యకు భారీ జరిమానా
WHAT. A. GAME! 👌 👌
— IndianPremierLeague (@IPL) April 16, 2023
A thrilling final-over finish and it's the @rajasthanroyals who edge out the spirited @gujarat_titans! 👍 👍
Scorecard 👉https://t.co/nvoo5Sl96y#TATAIPL | #GTvRR pic.twitter.com/z5kN0g409n
I would play Sanju Samson in the Indian T20 team every day.
— Harsha Bhogle (@bhogleharsha) April 16, 2023
Comments
Please login to add a commentAdd a comment