హార్దిక్ పాండ్యా (PC: IPL/BCCI)
IPL 2023 RR Vs GT: ‘‘నూర్‌తో ఎలా బౌలింగ్ చేయించాలన్న అంశాన్ని పూర్తిగా రషీద్‌కే వదిలేశాను. నూర్‌తో అతడి కంటే అత్యుత్తమంగా సమన్వయం చేసుకునే వాళ్లు మరెవరూ ఉండరన్న విషయం నాకు తెలుసు. వాళ్లు బౌలింగ్ చేస్తున్నపుడు ఎక్కడ స్లిప్‌ను ప్లేస్ చేస్తే బాగుంటుందో.. ఆ మేరకు సలహాలు మాత్రమే ఇచ్చాను.
మిగతాదంతా వాళ్లే ఆత్మవిశ్వాసంతో పూర్తి చేశారు’’ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ప్రశంసించాడు. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బౌలర్ల విజృంభణ.. రాజస్తాన్‌కు చుక్కలు
సొంతమైదానంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి రాజస్తాన్ రాయల్స్‌ను కోలుకోకుండా చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ అఫ్గనిస్తాన్ స్పిన్నర్.. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
ఇక మిగతావాళ్లలో మహ్మద్ షమీ, కెప్టెన్ పాండ్యా, జాషువా లిటిల్ ఒక్కో వికెట్ తీయగా.. మరో అఫ్గన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ బౌలర్ల విజృంభణతో సంజూ శాంసన్ సేన కథ 17.5 ఓవర్లకే ముగిసింది. 118 పరుగులకు రాజస్తాన్ ఆలౌట్ అయింది.
రషీద్ ఖాన్ కీలక పాత్ర
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ను ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(34 బంతుల్లో 41 పరుగులు), వన్‌డౌన్‌లో వచ్చిన హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 39 పరుగులు) తమ అజేయ ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చారు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 36 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక రాజస్తాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి గుజరాత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
తప్పులు ఒప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడను
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. రషీద్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడంటూ ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా వృద్ధిమాన్ సాహా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడంటూ కొనియాడాడు. ఇక గత మ్యాచ్‌లో పొరపాట్ల గురించి ఆశిష్ నెహ్రాతో చర్చించానన్న పాండ్యా.. ఈసారి వాటిని పునరావృతం కాకుండా చూసుకున్నానని పేర్కొన్నాడు.
తన తప్పులను తెలుసుకుని వాటిని సరిచేసుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడనన్న హార్దిక్ పాండ్యా.. శుబ్‌మన్ అవుటైన తర్వాత తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చిందన్నాడు. లోపం ఎక్కడుందో తెలుసుకుంటేనే దానిని సరిచేసుకుని.. విజయవంతం కాగలమని పేర్కొన్నాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 53 బంతుల్లో 59 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచినప్పటికీ పాండ్యా తమ జట్టును గెలిపించలేకపోయిన విషయం తెలిసిందే.
చదవండి: IPL 2023: కేఎల్ రాహుల్ అవుట్.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్
ఎందుకు బాబు మా మర్యాద తీస్తున్నారు.. ఆర్సీబీ బ్యాటర్లను మించిపోయారు..!
.@hardikpandya7 put on a show tonight 🤩
— IndianPremierLeague (@IPL) May 5, 2023
Relive the three 6️⃣s 🔥#TATAIPL | #RRvGT | @gujarat_titans pic.twitter.com/JdCQOOrHNR
That was some performance by @gujarat_titans 🙌#GT win the match by 9 wickets and add another 2 points to their tally 👌
— IndianPremierLeague (@IPL) May 5, 2023
Scorecard ▶️ https://t.co/54xkkylMlx#TATAIPL | #RRvGT pic.twitter.com/fJKu9gmvLW
Comments
Please login to add a commentAdd a comment