IPL 2023, GT vs RR: Sanju Samson hits hattrick of sixes against Rashid Khan - Sakshi
Sakshi News home page

IPL 2023: రషీద్‌ ఖాన్‌ అయితే ఏమైనా గొప్పా.. అక్కడుంది సంజూ! వీడియో​ వైరల్‌

Published Mon, Apr 17 2023 5:13 PM | Last Updated on Mon, Apr 17 2023 6:48 PM

Sanju Samson Hits Hattrick Of Sixes Against Rashid Khan - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ విజయంలో ఆ జట్టు కెప్టెన్‌ సంజూ శాంసన్‌(60), హెట్‌మైర్‌(56 నాటౌట్‌) కీలక పాత్ర పోషించారు. 178 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ సమయంలో శాంసన్‌, హెట్‌మైన తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో రాజస్తాన్‌ను అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌లకు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక శాంసన్‌ ఔటయ్యాక హెట్‌మైర్‌ తన విశ్వరూపాన్ని చూపించాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డ ఈ కరీబియన్‌.. ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

రషీద్‌ ఖాన్‌కు చుక్కలు చూపించిన శాంసన్‌
ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు  శాంసన్‌ చుక్కలు చూపించాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ వేసిన రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్‌ సిక్స్‌లను సంజూ బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో 3సిక్స్‌లు, రెండు సింగిల్స్‌తో కలిపి ఏకంగా 20 పరుగులు వచ్చాయి.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రషీద్‌ 2 వికెట్లు పడగొట్టనప్పటికీ..తన నాలుగు ఓవర్ల కోటాలో 46 పరుగులిచ్చాడు. ఇక వరల్డ్‌ నెం1 బౌలర్‌ అయిన రషీద్‌ ఖాన్‌కే చుక్కలు చూపించిన సంజూపై సర్వత్రా ప్రశంసల కురుస్తోంది.
చదవండి: IPL 2023 RCB Vs CSK: ఆర్సీబీతో మ్యాచ్‌.. చెన్నై కెప్టెన్‌గా జడేజా! మరి ధోని?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement