Noor Ahmad
-
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్‌పై నిషేధం
గుజరాత్ టైటాన్స్ బౌలర్, ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్‌పై ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) మేనేజ్మెంట్ నిషేధం విధించింది. షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ నూర్‌పై 12 నెలల నిషేధం విధిస్తున్నట్లు ILT20 యాజమాన్యం ప్రకటించింది. నూర్‌కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నూర్‌పై నిషేధం విధించింది. నూర్ ఇంటర్నేషనల్ లీగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు మొగ్గు చూపాడు. ILT20 క్రమశిక్షణా ఉల్లంఘణ కమిటీ తొలుత నూర్‌పై 20 నెలల నిషేధం విధించింది. అయితే ఒప్పందంపై సంతకం చేసే సమయానికి నూర్ మైనర్ కావడంతో అతని నిషేధ కాలాన్ని ఎనిమిది నెలలు తగ్గించి 12 నెలలకు కుదించారు. ఇంటర్నేషనల్ లీగ్ యాజమాన్యం కొద్ది నెలల క్రితం నూర్ సహచరుడు, ఆఫ్ఘనిస్తాన్ వివదాస్పద బౌలర్ నవీన్ ఉల్ హాక్‌పై కూడా నిషేధం విధించింది. అతను కూడా నూర్ లాగే కాంట్రాక్ట్ పొడిగింపు ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. 19 ఏళ్ల నూర్.. 2023 ILT20 సీజన్లో వారియర్స్ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ నూర్‌తో 2023 సీజన్‌కు ముందు 30 లక్షల బేస్ ధరకు ఒప్పందం కుదుర్చుకుంది. నూర్ 2023 ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. -
అదే గనుక జరిగితే అఫ్గనిస్తాన్‌ను ఎవరూ ఆపలేరు! ప్రత్యర్థికి చుక్కలే!
Asia Cup 2023: అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుకు స్పిన్నర్లే ప్రధాన బలమని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఒకవేళ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు గనుక వారికి లభిస్తే ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్-2023 బుధవారం(ఆగష్టు 30) ఆరంభం కానుంది. గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్ ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా... గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ పోటీ పడనున్నాయి. ఈ క్రమంలో అఫ్గన్ క్రికెట్ బోర్డు ఆదివారం తమ జట్టును ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సహా ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీతో పాటు నూర్ అహ్మద్‌కు ఈ 17 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. వాళ్లంతా కలిసి ప్రత్యర్థి జట్ల పని పడతారు ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ జట్టు ఎల్లప్పుడూ మెరుగ్గా బౌలింగ్ చేస్తుంది. వాళ్లకు గనుక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ దొరికితే ఇక అంతే సంగతులు. ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్.. అంతా కలిసి ప్రత్యర్థి జట్టు పని పట్టడం ఖాయం. ఒకవేళ పిచ్ పూర్తిగా స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించిందంటే.. తుదిజట్టులో నూర్ అహ్మద్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఊపిరి కూడా తీసుకోనివ్వరంటే అతిశయోక్తి కాదు అహ్మద్‌ను గనుక ఆడిస్తే.. అతడితో పాటు రషీద్, నబీ, ముజీబ్ ఒక్కొక్కరు పది ఓవర్లు వేస్తారు. ప్రత్యర్థి జట్టుకు ఊపిరి సలపనివ్వకుండా చెలరేగిపోతారు’’ అని అఫ్గన్ స్పిన్ దళాన్ని ఆకాశానికెత్తాడు. అయితే, అఫ్గన్‌కు చెప్పుకోదగ్గ పేసర్లు లేకపోవడం మాత్రం బలహీనతే అని ఆకాశ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఆ ముగ్గురి రికార్డు ఇలా కాగా ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా ఎదుగుతున్న రషీద్ ఖాన్ ఇప్పటి వరకు 87 వన్డేల్లో 170 వికెట్లు కూల్చాడు. ఇక ముజీబ్ ఉర్ రహ్మాన్ 64 మ్యాచ్‌లలో 91, మహ్మద్ నబీ 145 మ్యాచ్‌లు ఆడి 154 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబరు 3న బంగ్లాదేశ్‌తో లాహోర్‌లో అఫ్గన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్-2023 అఫ్గనిస్తాన్ జట్టు ఇదే హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, షరాఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ సలీం. చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్ -
గెలుపు జోష్‌లో ఉన్న గుజరాత్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!
ఐపీఎల్-2023లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్‌లోకి హార్దిక్ సేన అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుబ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్.. 9 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(64) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, మొహిత్ శర్మ తలా నాలుగు వికెట్లు పడగొట్టారు. నూర్ అహ్మద్‌కు గాయం.. ఇక ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన గుజరాత్ టైటాన్స్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ నూర్ ఆహ్మద్‌కు తీవ్రగాయమైంది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన నూర్ ఆహ్మద్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ స్ట్రైట్‌గా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతి నూర్ ఆహ్మద్ యాంకిల్ (చీలమండ)కు బలంగా తాకింది. దీంతో వెంటనే అతడు మైదానంలో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడిని మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. అతడి బౌలింగ్ కోటా తెవాటియా పూర్తి చేశాడు. కాగా నూర్ అహ్మద్ గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. pic.twitter.com/ACAcMsAxXv — CricDekho (@Hanji_CricDekho) May 15, 2023 చదవండి: Aiden Markram: ఒక్కరం కూడా సహకారం అందించలేకపోయాం.. టోర్నీ నుంచి ఇలా నిరాశగా! అతడు మాత్రం అద్భుతం.. -
నేలమీదకి దిగిన పాండ్యా.. కప్పు కొట్టే లక్షణాలివే
-
ఆ ఒక్క విషయంలోనే సలహా ఇచ్చాను.. అందుకు ఏమాత్రం సిగ్గుపడను: పాండ్యా
IPL 2023 RR Vs GT: ‘‘నూర్‌తో ఎలా బౌలింగ్ చేయించాలన్న అంశాన్ని పూర్తిగా రషీద్‌కే వదిలేశాను. నూర్‌తో అతడి కంటే అత్యుత్తమంగా సమన్వయం చేసుకునే వాళ్లు మరెవరూ ఉండరన్న విషయం నాకు తెలుసు. వాళ్లు బౌలింగ్ చేస్తున్నపుడు ఎక్కడ స్లిప్‌ను ప్లేస్ చేస్తే బాగుంటుందో.. ఆ మేరకు సలహాలు మాత్రమే ఇచ్చాను. మిగతాదంతా వాళ్లే ఆత్మవిశ్వాసంతో పూర్తి చేశారు’’ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ప్రశంసించాడు. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలర్ల విజృంభణ.. రాజస్తాన్‌కు చుక్కలు సొంతమైదానంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి రాజస్తాన్ రాయల్స్‌ను కోలుకోకుండా చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ అఫ్గనిస్తాన్ స్పిన్నర్.. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక మిగతావాళ్లలో మహ్మద్ షమీ, కెప్టెన్ పాండ్యా, జాషువా లిటిల్ ఒక్కో వికెట్ తీయగా.. మరో అఫ్గన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ బౌలర్ల విజృంభణతో సంజూ శాంసన్ సేన కథ 17.5 ఓవర్లకే ముగిసింది. 118 పరుగులకు రాజస్తాన్ ఆలౌట్ అయింది. రషీద్ ఖాన్ కీలక పాత్ర స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ను ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(34 బంతుల్లో 41 పరుగులు), వన్‌డౌన్‌లో వచ్చిన హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 39 పరుగులు) తమ అజేయ ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చారు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 36 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక రాజస్తాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి గుజరాత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తప్పులు ఒప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడను ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. రషీద్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడంటూ ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా వృద్ధిమాన్ సాహా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడంటూ కొనియాడాడు. ఇక గత మ్యాచ్‌లో పొరపాట్ల గురించి ఆశిష్ నెహ్రాతో చర్చించానన్న పాండ్యా.. ఈసారి వాటిని పునరావృతం కాకుండా చూసుకున్నానని పేర్కొన్నాడు. తన తప్పులను తెలుసుకుని వాటిని సరిచేసుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడనన్న హార్దిక్ పాండ్యా.. శుబ్‌మన్ అవుటైన తర్వాత తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చిందన్నాడు. లోపం ఎక్కడుందో తెలుసుకుంటేనే దానిని సరిచేసుకుని.. విజయవంతం కాగలమని పేర్కొన్నాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 53 బంతుల్లో 59 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచినప్పటికీ పాండ్యా తమ జట్టును గెలిపించలేకపోయిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2023: కేఎల్ రాహుల్ అవుట్.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్ ఎందుకు బాబు మా మర్యాద తీస్తున్నారు.. ఆర్సీబీ బ్యాటర్లను మించిపోయారు..! .@hardikpandya7 put on a show tonight 🤩 Relive the three 6️⃣s 🔥#TATAIPL | #RRvGT | @gujarat_titans pic.twitter.com/JdCQOOrHNR — IndianPremierLeague (@IPL) May 5, 2023 That was some performance by @gujarat_titans 🙌#GT win the match by 9 wickets and add another 2 points to their tally 👌 Scorecard ▶️ https://t.co/54xkkylMlx#TATAIPL | #RRvGT pic.twitter.com/fJKu9gmvLW — IndianPremierLeague (@IPL) May 5, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });