ఐపీఎల్-2023లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్‌లోకి హార్దిక్ సేన అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుబ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్.. 9 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(64) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, మొహిత్ శర్మ తలా నాలుగు వికెట్లు పడగొట్టారు.
నూర్ అహ్మద్‌కు గాయం..
ఇక ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన గుజరాత్ టైటాన్స్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ నూర్ ఆహ్మద్‌కు తీవ్రగాయమైంది. ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన నూర్ ఆహ్మద్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ స్ట్రైట్‌గా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతి నూర్ ఆహ్మద్
యాంకిల్ (చీలమండ)కు బలంగా తాకింది.
దీంతో వెంటనే అతడు మైదానంలో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడిని మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. అతడి బౌలింగ్ కోటా తెవాటియా పూర్తి చేశాడు. కాగా నూర్ అహ్మద్ గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
— CricDekho (@Hanji_CricDekho) May 15, 2023
చదవండి: Aiden Markram: ఒక్కరం కూడా సహకారం అందించలేకపోయాం.. టోర్నీ నుంచి ఇలా నిరాశగా! అతడు మాత్రం అద్భుతం..
Comments
Please login to add a commentAdd a comment