IPL 2023, RR Vs GT: Riyan Parag Cryptic Tweet After Failure Goes Viral - Sakshi
Sakshi News home page

#Riyan Parag: వీళ్లు కూడా నీలాగే.. దారుణమైన ట్రోల్స్‌! ట్వీట్‌తో బదులిచ్చిన రియాన్‌ పరాగ్‌.. వైరల్‌

Published Sat, May 6 2023 11:27 AM | Last Updated on Sat, May 6 2023 11:56 AM

IPL 2023 RR Vs GT: Riyan Parag Cryptic Tweet After Failure Goes Viral - Sakshi

IPL 2023 RR Vs GT- Riyan Parag: రాజస్తాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లకు కోట్లు తీసుకుంటూ.. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా కనీస స్థాయి ప్రదర్శన కనబరచకలేకపోతున్నాడంటూ రాజస్తాన్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్‌-2022లో 14 ఇన్నింగ్స్‌ ఆడి 183 పరుగులు మాత్రమే చేసిన రియాన్‌.. ఈ సీజన్‌లోనూ వైఫల్యం కొనసాగిస్తున్నాడు.

సంజూ మినహా మిగతా వాళ్లంతా
ముఖ్యంగా కీలక సమయాల్లో అవుటవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. తాజాగా.. ఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌(30 పరగులు) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రియాన్‌ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.

మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొన్న అతడు.. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో 118 పరుగులకే ఆలౌట్‌ అయిన రాజస్తాన్‌.. 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటర్ల వైఫల్యంపై ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ముఖ్యంగా రియాన్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా దింపడంపై సెటైర్లు వేస్తూ చురకలు అంటిస్తున్నారు.

వీళ్లంతా నీ అకాడమీయే
పనిలో పనిగా రియాన్‌తో పాటు ఈ సీజన్‌లో అంచనాలు అందుకోలేకపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా, సన్‌రైజర్స్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ సహా ముంబై సారథి రోహిత్‌ శర్మ పేర్లను ప్రస్తావిస్తూ.. వీళ్లంతా రియాన్‌ పరాగ్‌ అకాడమీ అంటూ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

రియాన్‌ ట్వీట్‌ నెట్టింట వైరల్‌
ఈ నేపథ్యంలో రియాన్‌ పరాగ్‌ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. తనపై ఘాటు విమర్శలు వస్తున్న తరుణంలో.. ‘‘కాలం.. మంచిదో .. చెడ్డదో..  ఏదేమైనా కరిగిపోతూనే ఉంటుంది’’ అని అతడు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2023 సీజన్‌లో రియాన్‌ పరాగ్‌ ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లలో కలిపి చేసిన మొత్తం పరుగులు 58. అత్యధిక స్కోరు 20. రాజస్తాన్‌ రియాన్‌ కోసం రూ. 3.80 కోట్లు ఖర్చు చేస్తే.. అతడు మాత్రం ఇంతవరకు ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించిందిలేదు.

చదవండి: Pak Vs NZ: 12 ఏళ్ల తర్వాత తొలిసారి సిరీస్‌ సమర్పయామి.. ఇప్పుడేమో ఏకంగా..
IPL 2023: కేఎల్‌ రాహుల్‌ అవుట్‌.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement