IPL 2023: Hardik Pandya Calls Match Loss to Kkr One-In-A-Million Defeat - Sakshi
Sakshi News home page

#HardikPandya: 'అద్బుతం జరిగేది ఒకసారే.. అంతిమంగా బలయ్యింది మేమే'

Published Thu, Apr 13 2023 8:40 PM | Last Updated on Thu, Apr 13 2023 9:15 PM

IPL 2023-Hardik Pandya Calls Match Loss To KKR one-in-a-million Defeat - Sakshi

Photo: IPL Twitter

గత ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు ఒక పీడకల లాంటిది. రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌తో గుజరాత్ గెలవాల్సిన మ్యాచ్‌ను కేకేఆర్‌ సంచలనం రింకూ సింగ్‌ ఒక్క ఓవర్‌తో లాగేసుకున్నాడు. 205 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్‌.. ఆఖరి ఓవర్లో రింకూ సింగ్‌ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టడంతో సంచలన విజయం సాధించింది.

రింకూ సింగ్ దెబ్బకు బలైన యస్‌ దయాల్‌ మొహం చూపించలేకపోయాడు. అయితే ఈ మ్యాచ్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అనారోగ్యం కారణంగా దూరంగా ఉన్నాడు. దీంతో రషీద్‌ ఖాన్‌ తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. రషీద్‌ హ్యాట్రిక్‌తో మెరిసినప్పటికి గుజరాత్‌ మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్బంగా టాస్‌ సమయంలో కెప్టెన్‌ పాండ్యా కేకేఆర్‌తో మ్యాచ్‌ ఓటమిపై స్పందించాడు. కేకేఆర్‌తో ఓటమి మీకు ఎలా అనిపించిందని కామెంటేటర్‌ అడగ్గా.. దీనికి పాండ్యా బదులిస్తూ.. ''కోట్లలో ఒక ఓటమి అని చెప్పొచ్చు.. అద్బుతం జరిగేది ఒకసారే.. కానీ అంతిమంగా బలయ్యింది మాత్రం మేమే. అదొక పీడకల అనుకుంటాం.. పంజాబ్‌తో మ్యాచ్‌పై ఫోకస్‌ పెట్టాం'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: మొదట ముద్దుపెట్టాడు.. ఔటైతే సంబరపడ్డాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement