Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నక్క తోక తొక్కాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతిని ఆవేశ్ ఖాన్ గుడ్‌లెంగ్త్ డెలివరీ వేశాడు. ఫ్లిక్ చేయడంతో మిస్ అయిన బంతి పాండ్యా ప్యాడ్లకు తాకి వికెట్ల వెనకాలకు వెళ్లింది. అయితే బంతి వేగంగా వెళ్లి వికెట్లను తాకినప్పటికి బెయిల్స్ మాత్రం కిందపడలేదు. ఒకవేళ బెయిల్స్ కింద పడి ఉంటే మాత్రం పాండ్యా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చేది.
ఇంతలో ఆవేశ్ ఖాన్ పాండ్యా వైపు దూసుకురాగా.. అప్పటికే పాండ్యా బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. బంతిని అందుకున్న ఆవేశ్ ఖాన్ స్టంప్స్‌ను తాకించడంతో నవ్వులు విరపూశాయి.మొత్తానికి తొలి బంతికే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడినప్పటికి పాండ్యా ఆ చాన్స్‌ను ఉపయోగించుకోలేకపోయాడు. 25 పరుగులు చేసి మోసిన్ ఖాన్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bails don't want to fall when Hardik Pandya is batting. Avesh Khan not happy with this character of the ball. 😂#GTvsLSG #LSGvsGT pic.twitter.com/t7uzfff6Ul
— Vikram Rajput (@iVikramRajput) May 7, 2023
Comments
Please login to add a commentAdd a comment