
న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్–19)పై పోరాడటానికి అవసరమైన డబ్బును విరాళాల రూపంలో సేకరించడానికి భారత్, పాకిస్తాన్ మధ్య ప్రేక్షకులు లేకుండా మూడు వన్డే మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుందని సూచించిన పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్‌కు భారత దిగ్గజ ఆల్‌రౌండర్, కపిల్‌దేవ్ కౌంటర్ ఇచ్చాడు. ‘భారత్ దగ్గర తగినంత డబ్బు ఉంది. దాని కోసం క్రికెట్ ఆడుతూ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం భారత క్రికెటర్లకు లేదు. ఇప్పటికే కరోనాపై పోరడటానికి తమ వంతుగా రూ.51 కోట్లను భారత ప్రభుత్వానికి బీసీసీఐ అందజేసింది. ఒకవేళ అవసరం అయితే మరింత డబ్బును కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు డబ్బు కోసం మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. అందులోనూ ఇటువంటి సమయంలో క్రికెటర్లతో రిస్క్ చేయాలని బీసీసీఐ భావిస్తుందని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం మేమంతా ఈ సంక్షోభం నుంచి ఎలా భయటపడాలనే దాని గురించి ఆలోచిస్తున్నాం. అయినా మూడు మ్యాచ్‌లతో నువ్వు ఎంత డబ్బు సేకరిస్తావు’ అక్తర్‌కు చురకంటించాడు.
Comments
Please login to add a commentAdd a comment