Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కేను విజేతగా నిలిపేందుకు జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన వంతు కృషి చేస్తున్నాడు. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 పోరులో జడ్డూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్‌లో 16 బంతుల్లో 22 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన జడ్డూ ఆ తర్వాత బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 18 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలో జడేజా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో దాసున్ షనకను ఔట్ చేయడం ద్వారా జడ్డూ ఐపీఎల్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అయితే ఐపీఎల్‌లో రెండువేలకు పైగా పరుగులు, 150 వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా జడేజా చరిత్ర సృష్టించాడు.
ఇంతకముందు డ్వేన్ బ్రావో 1560 పరుగులు, 183 వికెట్లు తీయగా.. ఆ తర్వాత సునీల్ నరైన్ 1046 పరుగులు చేయడంతో పాటు 163 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ఇద్దరు జడ్డూ కంటే ఎక్కువ వికెట్లు తీసినప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం రెండు వేల పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయారు.
Jaddu-giri 🤘
— JioCinema (@JioCinema) May 23, 2023
Ravindra Jadeja is once again spinning trouble for batters at #Anbuden 🤩#IPL2023 #IPLonJioCinema #GTvCSK #Qualifier1 #Yellove pic.twitter.com/OROqcccAVh
Comments
Please login to add a commentAdd a comment