ఔటైతే బాధపడతారు.. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ | Fans Surprise With-Loud Roar After Jadeja Out-Dhoni Massive Entry Viral | Sakshi
Sakshi News home page

#MSDhoni: ఔటైతే బాధపడతారు.. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌

Published Sun, May 14 2023 10:26 PM | Last Updated on Mon, May 15 2023 7:14 AM

Fans Surprise With-Loud Roar After Jadeja Out-Dhoni Massive Entry Viral - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే ఆడే ప్రతీ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తుతున్నారు. ఎందుకనేది ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి. కేవలం ఎంఎస్‌ ధోని కోసమే.  అలాంటి ధోని బ్యాటింగ్‌కు వచ్చి ఒక్క బంతి ఆడినా చాలు అన్నట్లుగా అభిమానులు తపించిపోతున్నారు. ధోని బ్యాటింగ్‌ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారన్నది తాజాగా మరోసారి కనిపించింది. 

ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌ సందర్భంగా తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 20 పరుగులు చేసి వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. అప్పటికే సీఎస్‌కే ఇన్నింగ్స్‌కు కేవలం రెండు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సాధారణంగా తాము మద్దతిస్తున్న జట్టు బ్యాటర్‌ ఔట్‌ అయితే బాధపడడం చూస్తాం. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయింది.


Photo: IPL Twitter

జడేజా ఔట్‌ కాగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. కారణం జడ్డూ ఔట్‌ అయితేనే ధోని ఎంట్రీ ఇస్తాడు కాబట్టి. ఇక ధోని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే సమయంలో స్టేడియం మొత్తం ధోని నామసర్మణతో మార్మోగిపోయింది. అయితే ధోని ఒక నోబాల్‌ సహా ఫ్రీహిట్‌ వచ్చినప్పటికి రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. 

చదవండి: శివమ్‌ దూబే సిక్సర్‌ దెబ్బ.. కేకేఆర్‌ చీర్‌గర్ల్స్‌ అబ్బ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement