స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియాకు ఆల్‌రౌండర్ లోటును వెంకటేశ్ అయ్యర్ తీర్చాడు. ఈ సిరీస్‌లో వెంకటేశ్ అయ్యర్ బ్యాట్‌తోను, బంతితోను అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 92 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆదివారంజరిగిన అఖరి టీ20లో 19 బంతుల్లో 35 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు కూడా పడగొట్టాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ తన పవర్ హిట్టింగ్‌తో అకట్టుకుంటున్నాడు.
తొలి టీ20లో ఇన్నింగ్స్ అఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్.. 13 బంతుల్లో 24 పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అదే విధంగా రెండో టీ20లో కూడా 18 బంతుల్లో 33 పరుగులు కూడా సాధించాడు. అయ్యర్ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. టీమిండియాకు సరైన ఆల్‌రౌండర్ దొరికినట్టే. అంతే కాకుండా జట్టులో హార్ధిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికేశాడని క్రికెట్ నిపుణులు, మాజీలు అభిపప్రాయపడుతున్నారు. ఇక గతేడాది న్యూజిలాండ్‌పై టీ20ల్లో భారత తరుపున అయ్యర్ అరంగేట్రం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment