Garry Sobers
-
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డు
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ ఇంగ్లిష్ ఆటగాడికీ సాధ్యం కాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్ ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది.తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకేఆతిథ్య జట్టు ఆది నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ ఇన్నింగ్స్ విజయంపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే వెస్టిండీస్‌ను ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. 371 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్ జట్టుకు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్, అరంగేట్ర బౌలర్ గుస్ అట్కిన్సన్, కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేసి వికెట్లు కూల్చారు.ఇన్నింగ్స్ ఓటమి దిశగా విండీస్ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికే వెస్టిండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా.. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే వెస్టిండీస్ మరో 171 పరుగులు చేయాలి. అయితే, ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.ఇదిలా ఉంటే.. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ ఓపెనర్ మిక్లే లూయీస్(14), వన్‌డౌన్ బ్యాటర్ కిర్క్ మెకాంజీ(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్‌లోనూ మిక్లే లూయీస్(27) స్టోక్సే అవుట్ చేయడం విశేషం.చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డుఈ క్రమంలో స్టోక్స్ టెస్టుల్లో అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్ తరఫున ఆరు వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు రెండు వందలకు పైగా వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు.ఓవరాల్‌గా.. వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్, సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు.కాగా 103 టెస్టుల్లో స్టోక్స్ ఇప్పటి వరకు 6320 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 258. ఇక టెస్టుల్లో తీసిన వికెట్లు 201.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో పేస్ ఆల్‌రౌండర్ స్టోక్స్ బంతితో రాణించినా.. బ్యాట్‌తో మ్యాజిక్ చేయలేకపోయాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు పరుగులే చేసి గుడకేశ్ మోటీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. చదవండి: KKR: ద్రవిడ్ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్?Kallis. Sobers. Stokes. Legends only, please. #EnglandCricket | #ENGvWI pic.twitter.com/zQADWlbOnJ— England Cricket (@englandcricket) July 11, 2024 -
దిగ్గజంతో చేతులు కలిపిన రోహిత్, విరాట్..
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమిండియా వెస్టిండీస్ టూర్‌కు సన్నద్ధమైంది. ఇప్పటికే కరీబియన్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించారు. ఇక విండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు బుధవారం విండీస్ దిగ్గజ ప్లేయర్ గ్యారీ సోబర్స్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతోపాటు శుభ్‌మన్ గిల్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్ లాంటి క్రికెటర్లు గ్యారీ సోబర్స్‌తో మాట్లాడారు. అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లను అందరిని దగ్గరుండి పరిచయం చేయించాడు. గిల్ ను పరిచయం చేస్తూ.. మా టీమ్ లో ఉన్న యంగ్, ఎక్సైటింగ్ ప్లేయర్ ఇతడు అని చెప్పడం విశేషం. సోబర్స్, అతని భార్య స్టేడియానికి వచ్చారు. తనను కలిసి టీమిండియా క్రికెటర్లందరికీ సోబర్స్ తన భార్యను ప్రత్యేకంగా పరిచయం చేశాడు. గ్యారీ సోబర్స్ రోహిత్, విరాట్లతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ వీడియోను బీసీసీఐ షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. నిజానికి సోబర్స్ ను కలిసి విరాట్ కోహ్లి.. 2020లో అదే గ్యార్‌ఫీల్డ్ సోబర్స్ పేరిట ఉన్న మేల్ క్రికెట్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు(గ్యారీ సోబర్స్ అవార్డు) గెలుచుకున్నాడు. ఇప్పటికే వన్డే, టెస్ట్ జట్లను బీసీసీఐ ప్రకటించింది. టి20 జట్టును మాత్రం కొత్త చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో నంబర్ వన్, వన్డేల్లో నంబర్ టూ ర్యాంకుల్లో ఉంది. తొలి టెస్ట్ జులై 12న ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన తర్వాత టీమిండియా ఆడబోతున్న తొలి సిరీస్ ఇదే. ఇండియా టెస్టు టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, జడేజా, శార్దూల్, అక్షర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, నవ్‌దీప్ సైనీ In Barbados & in the company of greatness! 🫡 🫡#TeamIndia meet one of the greatest of the game - Sir Garfield Sobers 🙌 🙌#WIvIND pic.twitter.com/f2u1sbtRmP — BCCI (@BCCI) July 5, 2023 చదవండి: చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పారితోషికం ఎంతో తెలుసా? -
Ben Stokes: టెస్టుల్లో స్టోక్స్ అరుదైన ఘనత.. క్రికెట్ దిగ్గజాలతో పాటుగా..
England Tour Of West Indies 2022- Ben Stokes Century: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 114 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 120 పరుగులు సాధించిన స్టోక్స్.. టెస్టుల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ బాది ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ తన పేరిట ఓ రికార్డు లిఖించుకున్నాడు. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. క్రికెట్ దిగ్గజాలు సర్ గ్యారీ సోబర్స్, సర్ ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, జాక్వెస్ కలిస్ తర్వాతి స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో 5 వేలకు పైగా పరుగులు.. 150కి పైగా వికెట్లు సాధించిన టాప్-5 ఆల్‌రౌండర్లు ►గ్యారీ సోబర్స్ – 8032 పరుగులు, 235 వికెట్లు- 93 టెస్టుల్లో ►ఇయాన్ బోథమ్– 5200 పరుగులు, 383 వికెట్లు- 102 టెస్టుల్లో ►కపిల్ దేవ్– 5248 పరుగులు, 434 వికెట్లు- 131 టెస్టుల్లో ►జాక్వస్ కలిస్– 13289 పరుగులు, 292 వికెట్లు- 166 టెస్టుల్లో ►బెన్ స్టోక్స్- 5005* పరుగులు, 170 వికెట్లు, 78 టెస్టుల్లో Ben Stokes completing 5,000 Test runs landmark in style. pic.twitter.com/AuKZ72dCwU — Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2022 చదవండి: Sehwag-Akhtar: ఏదో ఒకరోజు సెహ్వాగ్ చెంప చెల్లుమనిపిస్తా: అక్తర్ -
బాలీవుడ్ భామతో వెస్టిండీస్ క్రికెటర్ ప్రేమాయణం... చివరకు ఏమైందంటే
వెస్ట్ ఇండీస్ క్రికెటర్.. అరుదైన ఆల్‌రౌండర్స్‌లో ఒకడు.. గ్యారీ సోబర్స్! సిల్వర్ స్క్రీన్ గ్లామర్.. టాలెంట్‌లో ది బెస్ట్.. అంజు మహేంద్రు! ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. కానీ పెళ్లితో జత కట్టలేకపోయారు. కలవని ఆ ప్రేమ కథ గురించి.. పేజ్ త్రీ సర్కిల్ పార్టీల్లో క్రికెట్, సినిమా స్టార్స్ కలసుకోవడం సర్వసాధారణం. అలాంటి పార్టీలోనే అంజు మహేంద్రును కలిశాడు గ్యారీ సోబర్స్. తొలి చూపులోనే ఆమె అతణ్ణి ఆకట్టుకుంది. ‘హాయ్.. నేను గ్యారీ’ అంటూ ఆమె దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నాడు. ‘ఎస్.. ఐ నో.. మై నేమ్ ఈజ్ అంజు.. అంజు మహేంద్రు.. ఫిల్మ్ యాక్ట్రెస్’ అంటూ కరచాలనం చేసింది. ‘ఐ నో!’ అంటూ నవ్వి.. ‘నాతో డాన్స్ చేస్తావా అన్నట్టుగా ‘డాన్స్..?’ అంటూ తన చేయి అందించాడు ఆమెకు. ‘వై నాట్.. ’అంటూ అతని చేయి అందుకొని అతనితో అడుగులు కదిపింది. ఆ ఇద్దరి డాన్స్‌కు అందరూ కళ్లప్పగించారు. ఆ రోజు ఆ పార్టీలో ఆ జంటే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయింది. గ్యారీతో అంజు స్నేహం కంటిన్యూ అయింది. అప్పుడు అంజుకి ఇరవై ఏళ్లు. అప్పటికే రాజేశ్ ఖన్నాతో ప్రేమలో ఉంది.. స్పర్థలూ మొదలయ్యాయి. అంజుని హీరోయిన్గా ప్రోత్సహించినట్టే ప్రోత్సహించి.. ఆమెకు అవకాశాలు రావడంతోనే తనకున్న పొజెసివ్ నేచర్‌ను ప్రదర్శించడం మొదలుపెట్టాడు రాజేశ్ ఖన్నా. ఆ తీరుతో విసిగి వేసారిపోయున్న అంజుకి గ్యారీ ఫ్రెండ్షిప్తో సాంత్వన దొరికింది. ఇది 1966 నాటి సంగతి. ఆ సమయంలో ఇండియాతో మ్యాచ్ ఆడ్డానికి ఇక్కడికి వచ్చింది వెస్ట్ ఇండీస్ టీమ్. ఆ టూర్ అంతా గ్యారీ .. అంజుతోనే కలసి ఉన్నాడు. మ్యాచ్ అయిపోగానే హ్యాంగవుట్లు, డిన్నర్లు, పార్టీలు పరిపాటయ్యాయి ఆ జంటకి. వెస్ట్ ఇండీస్ టీమ్ ఇండియా టూర్ ముగిసే సమయానికి అంజు ప్రేమలో మునిగిపోయాడు గ్యారీ. ఆ ఇద్దరికీ నిశ్చితార్థమూ జరిగింది అంజు వాళ్ల కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో (గ్యారీ సోబర్స్ ఆటోబయోగ్రఫీ ప్రకారం). ఇద్దరి షెడ్యూల్స్‌లోని వీలు ప్రకారం పెళ్లికి తేదీ నిర్ణయించుకోవాలను కున్నారు. ఆలోపు సొంత దేశానికి వెళ్లిపోయాడు గ్యారీ. అక్కడ గ్యారీ ఉత్తరప్రత్యుత్తరాలు.. టెలిఫోన్ సంభాషణలతో అంజుతో అనుబంధం కొనసాగించాడు. కొన్నాళ్లు గడిచాక.. మ్యాచ్‌లతో, క్రికెట్ టూర్లతో బిజీ అయిపోయాడు. అంజును పూర్తిగా మరచిపోకపోయినా ఆమె ఆలోచన మాత్రం వెనక్కి వెళ్లిపోయింది. ఆ క్రమంలోనే అతను ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ ప్రు కిర్బీ అనే అమ్మాయిని కలిశాడు. ఆ ఆకర్షణలో పడ్డాడు. అది లవ్వై.. మ్యారేజ్ వరకూ వెళ్లింది. అప్పుడు..అంజుకి ఫోన్ చేశాడు గ్యారీ. ‘అంజు.. ఐ యామ్ రియల్లీ సారీ.. ప్రు అని.. ఆస్ట్రేలియన్.. వి ఆర్ ఇన్ లవ్. వాన్న గెట్ మ్యారీ!’ అని ఆగాడు. అవతల నుంచి అంజు ఉఛ్వాస..నిశ్వాసాలే వినపడుతున్నాయి. గ్యారీ మనసులో ఏదో బాధ.. ‘హలో.. అంజు..’ పిలిచాడు. అతని స్వరంలో అపరాధ భావం స్పష్టంగా! ‘ఎస్ గ్యారీ..’ గొంతు పెగల్చుకుని పలికింది అంజు. ‘ఐ యామ్ సారీ డియర్.. ’ గ్యారీ. ‘వాట్ కెన్ ఐ డు ఫర్ యూ నౌ’ అని అడిగింది. ‘నీడ్ యువర్ కన్సెంట్ టు మ్యారీ ప్రు’ చెప్పాడు గ్యారీ. ‘ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ గ్యారీ’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది అంజు. పొగిలి పొగిలి ఏడ్చింది. అవతల గ్యారీ కూడా.. ‘ప్లీజ్ ఫర్ గివ్ మీ డియర్’ అంటూ ఏడ్చేసి అపరాధ భారం దించేసుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ ప్రు కిర్బీని గ్యారీ పెళ్లి చేసుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని రాతపూర్వకమైన సమ్మతినీ తెలియజేసింది అంజు మహేంద్రు. గ్యారీ, ప్రుల పెళ్లి అయిపోయింది. అంజు ఒంటరిగానే మిగిలిపోయింది. ‘అంజు చాలా మంచి అమ్మాయి. ఆమెను మనసావాచా ఇష్టపడ్డాను. ఇద్దరం కలసి ఇంగ్లండ్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తను నాతో వచ్చేయడానికి ఉవ్విళ్లూరింది. అలా ఇంగ్లండ్ వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడానికి ఆ టైమ్‌లో నేను ఆమె పేరు మీద రిజర్వ్ బ్యాంక్‌లో కొంత డబ్బును డిపాజిట్ చేయాలనే నియమం ఏదో ఉన్నట్టుంది. అదేంటో నాకర్థం కాలేదు. ఇండియా వదిలి వచ్చేశాను. తర్వాత తనూ వచ్చేద్దామనుకుంది. కానీ చివరి నిమిషంలో ఆగిపోయింది. మా రిలేషన్షిప్ బ్రేక్ అవడానికి ఆ దూరమే కారణం అనుకుంటున్నాను!’ – గ్యారీ సోబర్స్ (‘గ్యారీ సోబర్స్: మై ఆటోబయోగ్రఫీ’ నుంచి) -ఎస్సార్ -
విండీస్ బోర్డును రద్దు చేయండి
గ్రెనెడా: తమ దేశ క్రికెట్ బోర్డును వెంటనే రద్దు చేయాలని వెస్టిండీస్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, వివియన్ రిచర్డ్స్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న బోర్డుకు జవాబుదారీతనం లేదని, దీనివల్ల క్రికెట్ పరిస్థితి దిగజారిపోతోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న బోర్డు డెరైక్టర్లంతా వెంటనే రాజీనామా చేసి, మద్యంతర బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. భారతదేశంలో బీసీసీఐ శక్తివంతమైన బోర్డే అయినా, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తుందని... కానీ వెస్టిండీస్‌లో అలాంటి పరిస్థితి లేదని అన్నారు.