ఛారిటీ మ్యాచ్లో లారా, బోథమ్ | Lara, Botham to feature in all-star CPL charity match | Sakshi
Sakshi News home page

ఛారిటీ మ్యాచ్లో లారా, బోథమ్

Published Sat, May 24 2014 4:34 PM | Last Updated on Mon, Aug 13 2018 9:00 PM

ఛారిటీ మ్యాచ్లో లారా, బోథమ్ - Sakshi

ఛారిటీ మ్యాచ్లో లారా, బోథమ్

అలనాటి వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మన్ బ్రయాన్ లారా, ఇంగ్లండ్ ఆల్రౌండర్ ఇయన్ బోథమ్.. వీళ్లంతా మళ్లీ వచ్చి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? త్వరలో జరగబోయే ఆల్ స్టార్ ఛారిటీ ట్వంటీ 20 పోటీలకు వీళ్లిద్దరినీ కెప్టెన్లుగా ఎంపిక చేశారు. ఆగస్టు 12న వార్నర్ పార్కులో జరిగే ఈ మ్యాచ్లో అలనాటి సెలబ్రిటీలు, నేటి క్రికెట్ తారలు అందరూ పాల్గొంటారని భావిస్తున్నారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) పేరుతో వెస్టిండీస్ దీవుల్లోని వివిధ జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి.

బ్రిటిష్ మీడియా కింగ్ పియర్స్ మోర్గాన్ ఇప్పటికే బోథమ్ జట్టులో ఆడతానని తెలిపారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఈ ప్రాంతంలో ఉండే క్రికెట్ అభిమానులకు షడ్రసోపేతమైన విందులాంటిదని బోథమ్ చెప్పారు. 2007లో క్రికెట్ నుంచి రిటైరైన లారా వెస్టిండీస్ తరఫున టెస్టుల్లోను, ఫస్ట్క్లాస్ క్రికెట్లోను అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement