
‘‘నా గుండె ముక్కలవుతోంది. నొప్పితో విలవిల్లాడుతోంది. షేన్ అంత్యక్రియలకు హాజరుకాలేకపోవడం బాధను రెట్టింపు చేస్తోంది. గత రాత్రి షూట్ వల్ల నేను అక్కడికి వెళ్లలేకపోతున్నా. ఈ ఫొటోలు మా ఎంగేజ్‌మెంట్ సందర్భంగా శ్రీలంకలో తీసుకున్నవి.
అప్పుడు మా పిల్లలంతా మాతోనే ఉన్నారు. అవి సంతోషకర క్షణాలు. తను వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్ మాజీ ప్రేయసి ఎలిజబెత్ హర్లే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కాగా ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మార్చి 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో హఠాన్మరణం చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో మార్చి 20న అతడి భౌతిక కాయానికి ఆస్ట్రేలియాలో అంత్యక్రియలు(ప్రైవేట్ ప్యునరల్) నిర్వహించారు. అత్యంత ఆప్తుల నడుమ అంతిమ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
అయితే, షూటింగ్ కారణంగా వార్న్ మాజీ ప్రేయసి, నటి ఎలిజబెత్ ఇందులో భాగం కాలేకపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె భావోద్వేగ నోట్ షేర్ చేశారు. తన నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఫొటోలను పంచుకుంటూ వార్న్ కడసారి చూపునకు నోచుకోలేదంటూ ఉద్వేగానికి లోనయ్యారు. భౌతికంగా వార్న్ దూరమైనా అతడి జ్ఞాపకాలు చిరకాలం నిలిచి ఉంటాయని పేర్కొన్నారు.
కాగా కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన వార్న్, ఎలిజబెత్ 2011 సెప్టెంబరులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కానీ, రెండేళ్లకే వీరి బంధం బీటలు వారింది. 2013లో ఈ జంట విడిపోయింది. ఇక వార్న్ సంతానం విషయానికొస్తే.. భార్య సిమోనే కాలన్‌తో అతడు ముగ్గురు పిల్లలు కలిగారు. వీరిద్దరు 2005లో విడిపోయారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment