Elizabeth Hurley
-
Shane Warne: ‘నా గుండె నొప్పితో విలవిల్లాడుతోంది’
‘‘నా గుండె ముక్కలవుతోంది. నొప్పితో విలవిల్లాడుతోంది. షేన్ అంత్యక్రియలకు హాజరుకాలేకపోవడం బాధను రెట్టింపు చేస్తోంది. గత రాత్రి షూట్ వల్ల నేను అక్కడికి వెళ్లలేకపోతున్నా. ఈ ఫొటోలు మా ఎంగేజ్మెంట్ సందర్భంగా శ్రీలంకలో తీసుకున్నవి. అప్పుడు మా పిల్లలంతా మాతోనే ఉన్నారు. అవి సంతోషకర క్షణాలు. తను వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్ మాజీ ప్రేయసి ఎలిజబెత్ హర్లే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాగా ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మార్చి 4న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో హఠాన్మరణం చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో మార్చి 20న అతడి భౌతిక కాయానికి ఆస్ట్రేలియాలో అంత్యక్రియలు(ప్రైవేట్ ప్యునరల్) నిర్వహించారు. అత్యంత ఆప్తుల నడుమ అంతిమ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే, షూటింగ్ కారణంగా వార్న్ మాజీ ప్రేయసి, నటి ఎలిజబెత్ ఇందులో భాగం కాలేకపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె భావోద్వేగ నోట్ షేర్ చేశారు. తన నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఫొటోలను పంచుకుంటూ వార్న్ కడసారి చూపునకు నోచుకోలేదంటూ ఉద్వేగానికి లోనయ్యారు. భౌతికంగా వార్న్ దూరమైనా అతడి జ్ఞాపకాలు చిరకాలం నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన వార్న్, ఎలిజబెత్ 2011 సెప్టెంబరులో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ, రెండేళ్లకే వీరి బంధం బీటలు వారింది. 2013లో ఈ జంట విడిపోయింది. ఇక వార్న్ సంతానం విషయానికొస్తే.. భార్య సిమోనే కాలన్తో అతడు ముగ్గురు పిల్లలు కలిగారు. వీరిద్దరు 2005లో విడిపోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Elizabeth Hurley (@elizabethhurley1) -
‘ప్రియ’మైన ముద్దు... 48 లక్షలు!
అధర చుంబనంలో మునిగిపోయిన వీరిద్దరూ ఇంగ్లాండ్ మోడల్ కమ్ నటీమణి ఎలిజబెత్ హర్లీ, ఇండో కెనెడియన్ వ్యాపారవేత్త జూలియన్ భారతీలు.కెనడాలో గురువారం నిర్వహించిన వుడ్‌సైడ్ ఎండ్ సమ్మర్ పార్టీలో ఈ సుందరి(49) తన ముద్దును వేలం వేయగా.. 27 ఏళ్ల జూలియన్.. రూ. 48 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఓ సేవా కార్యక్రమానికి నిధుల కోసం ఆమె ముద్దును ఇలా వేలం వేశారు. -
ఎలిజబెత్ హర్లీ ముద్దు ఖరీదు రూ. 48 లక్షలు!
లాస్ ఏంజిల్స్ : బహిరంగంగానే ఇలా గాఢ అధర చుంబనంలో మునిగిపోయిన వీరిద్దరూ ఇంగ్లండ్ మోడల్ కమ్ నటీమణి ఎలిజబెత్ హర్లీ, కెనడా బిలినీయర్ కుమారుడైన ఇండో కెనడియన్ వ్యాపారవేత్త జూలియన్ భారతీలు. కెనడాలోని విండ్సర్ నగరంలో నిర్వహించిన వుడ్‌సైడ్ ఎండ్ సమ్మర్ పార్టీలో ఈ 49 ఏళ్ల సుందరి తన ముద్దును వేలం వేయగా.. 27 ఏళ్ల జూలియన్ ఏకంగా 81 వేల డాలర్ల(రూ. 48 లక్షలు)కు సొంతం చేసుకున్నాడు. అయితే... ఈ ముద్దు వేలం వేసింది డబ్బు సంపాదించడం కోసం కాదండోయ్.. ఓ సేవా కార్యక్రమానికి నిధుల కోసం. ఈమె ముద్దు వేలం ద్వారా వచ్చిన డబ్బును ఎల్టన్ జాన్స్ ఎయిడ్స్ ఫౌండేషన్‌కు అందింది. అందుకే మరి.. భారీ మొత్తం చెల్లించి ముద్దును కొనుక్కున్నా.. జూలియన్ భార్య క్రిస్టీ కూడా ఫీలవ్వలేదట. జులియన్-క్రిస్టీల జంటకు ముగ్గురు పిల్లలు. -
వార్న్.. మళ్లీ ఒంటరి !
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్‌వార్న్ మళ్లీ ఒంటరివాడయ్యాడు. బ్రిటిష్ మోడల్, నటి ఎలిజబెత్ హార్లీతో మూడేళ్ల బంధాన్ని తెంచుకున్నాడు. ఓ ఆస్ట్రేలియా టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్న్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. ‘మేమిద్దరం విడిపోయాం. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. మా మధ్య ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేకపోయినా మంచి స్నేహితులం. మేం ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలుసుకుంటాం’ అని చెప్పాడు. 2010లో భార్య సైమోన్కు విడాకులిచ్చిన తర్వాత వార్న్, హార్లీతో ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి వరకు రాలేకపోయారు. మరోవైపు బ్రిటిష్ మోడల్ మిచెల్లీ మోన్‌తో డేటింగ్ వార్తలపైనా వార్న్ స్పందించాడు. ’నేను ఇప్పుడు ఒంటరిని. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. ’ అని ఈ మాజీ స్పిన్నర్ స్పష్టం చేశాడు. -
'బిల్ క్లింటన్ తో అఫైర్ వార్తలు అవాస్తవం'
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో గత సంవత్సర కాలంగా ఆఫైర్ నడిపిందని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ టామ్ సైజ్ మోర్ చేసిన వ్యాఖ్యల్ని బ్రిటన్ సినీ తార ఎలిజబెత్ హార్లీ ఖండించారు. బిల్ క్లింటన్ తో తనకు అఫైర్ ఉందని చేసిన వ్యాఖ్యలు చాలా తెలివి తక్కువ పని. అవాస్తవం. నా లాయర్లు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు అని హ్యార్లీ ట్విటర్ లో స్పందించారు. ఈ రోజు తనకు భయంకరమైన రోజు అని ట్విటర్ లో పేర్కోన్నారు. 'నేను ఎప్పుడు బిల్ క్లింటన్ ను కలువలేదు' అని హ్యార్లీ తెలిపింది. 1998లో వైట్ హౌజ్ లో 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్' చిత్ర ప్రదర్శన అనంతరం తాను ఎలా క్లింటన్ కు పరిచయం చేశానో అనే విషయాన్ని సైజ్ మోర్ తెలిపారు. 1992 లో రూపొందించిన పాసింజర్ 57 అనే చిత్ర సందర్భంగా ఏర్పడిన పరిచయంతో హ్యార్లీ, సైజ్ మోర్ లు కొంత కాలం డేటింగ్ చేశారు. Ludicrously silly stories about me & Bill Clinton. Totally untrue. In the hands of my lawyers. Yawn. — Elizabeth Hurley (@ElizabethHurley) February 5, 2014 -
అవును, వాళ్లిద్దరూ మళ్లీ విడిపోయారు!
హాలీవుడ్ నటి ఎలిజబెత్ హ్యార్లీ, ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ విడిపోయారంటూ గత సెప్టెంబర్ లో దాంపత్య జీవితానికి వీరిద్దరూ ముగింపు పలికారు అనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే అవన్ని గాలి వార్తలేనని... తాము కలిసే ఉన్నామని హ్యర్లీ, వార్న్ లు అప్పుడే ఖండించారు. పలు సందర్భాల్లో పలు రకాలుగా రూమర్లు జోరుగా షికారు చేశాయి. అయితే ప్రస్తుతం హ్యారీ, వార్న్ లు విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నారని అత్యంత సన్నిహితులు సమాచారాన్ని మీడియాకు అందించినట్టు హల్లో అనే ఆంగ్ల పత్రిక వార్తను ప్రచురించింది. పత్రిక కథనానికి తోడుగా షేన్ వార్న్ ట్విటర్ లో చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు బలం చేకూర్చాయి. గతం గురించి ఆలోచించి బాధపడకూడదు. గతాన్ని తలుచుకుని బాధపడితే భవిష్యత్ దెబ్బతింటుంది. రేపటి రోజును ఊహించుకుంటూ ఆనందంగా కాలం గడపాల్సిందేనని.. నిన్నటి గురించి ఆలోచించడం ఎందుకు అని ట్విట్టర్ లో షేన్ సందేశాన్ని పోస్ట్ చేశారు. అయితే షేన్ అమితంగా ఇష్టపడే హ్యార్లీ.. ఆ వార్లలన్ని అవాస్తవాలని, తమ మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుంటున్నామని తెలిపారు. గత మూడు వారాలుగా వారిద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదని విశ్వసనీయ సమాచారం. -
నువ్వక్కడ...నేనిక్కడుంటే...కుదరదు!
ఆధునిక జీవితంలో మానవ సంబంధాలు అంతంత మాత్రమే అనే వాదన కాదనలేని వాస్తవం. ప్రస్తుత నాగరిక జీవితం ఉరుకులు పరుగులు మధ్య కొనసాగడం సర్వ సాధారణం. ఇక టెక్నాలజీ రంగంలో చోటు చేసుకున్న గణనీయ మార్పులు సానుకూలమైన ప్రభావాన్ని చూపాయో.. వ్యక్తుల జీవితాల్లో వ్యత్యాసాన్ని అంతే మొత్తంలో కూడా పంచాయి. ఇక టెక్నాలజీ రంగంలో అనూహ్యమైన మార్పులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగిపోవడం కూడా వ్యక్తిగత జీవితాలకు ఆర్ధికంగా బలం చేకూరాయి. అయితే అంతే మొత్తంలో వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయం తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. సాంకేతికంగా అనేక వినియోగ, వినోదాత్మక సాధనాలు మన జీవితాల్లో ప్రవేశించిన తర్వాత మరో వ్యక్తితో మాట్లాడలేని పరిస్థితి వచ్చిపడింది. యాంత్రిక జీవితంలో ఎవరిలోకం వారిదే. ఒకే ఇంట్లో ఉన్న ఎవరీ ప్రపంచం వారిదే. మానవ అవసరాలను తీర్చడానికి అనేక సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. టెలివిజన్ లు, వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, ఇతర వినోదాత్మక, వినియోగ సాధనాలు తాత్కాలిక ఆనందాన్ని పంచుతున్నాయి. ఇవన్ని కొంత కాలంపాటు సంతృప్తిని అందించడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఇక ఒకే రకమైన జీవితం అలవాటు పడినవారికి కొద్దికాలం తర్వాత రాగానే ఏదో కోల్పోతున్నామనే భావన, అభద్రతాభావం పెరిగిపోతుంది. అప్పుడు వారిలో అసంతృప్తి కలగడం సహజం. ఆ సంతృప్తే అనేక ప్రతికూల నిర్ణయాలకు దారి తీస్తున్నాయి. ఇది సాధారణ వ్యక్తులే పరిమితం కాకుండా.. సెలబ్రీటలకు కూడా ఇదే పరిస్థితి ఎదురువుతోంది. ఉద్యోగ రీత్యా దంపతులు వేరు వేరుగా జీవించడమనది ప్రస్తుతం మనం చూస్తున్నదే. టెక్నాలజీ సాధానాలు మానసికంగా దగ్గర చేసినటప్పటికి... ప్రొఫెషనల్ లైఫ్ కారణంగా వారి మధ్య ఎడబాటు వారి సంబంధాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణమవుతున్నాయి. అందుకు ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్, ఆయన సతీమణి ఎలిజబెత్ హ్యారీ కథే మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అరుణ్ నాయర్ తో నాలుగేళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పాకా 2010లో షేన్ వార్న్ తో డేటింగ్ ప్రారంభించింది. ఆతర్వాత ఓ సంవత్సరం తర్వాత హ్యర్లీని వార్న్ ను పెళ్లాడారు. ప్రొఫెషనల్ జీవితంలో సుదీర్ఘ ప్రయాణాల వల్ల వైవాహిక జీవితంలో క్వాలీటి లైఫ్ ను ఎంజాయ్ చేయడం లేదన్నది వారిద్దరి ఫిర్యాదు. వారి జీవితంలో ఆ అంశమే అతిపెద్ద సమస్యగా మారింది. ఆస్ట్రేలియాలో షేన్ వార్న్.. బ్రిటన్ లో ఎలిజబెత్ హ్యరీలు గడపాల్సి రావడంతో కుటుంబ జీవితాన్ని ఎక్కువ శాతం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లోనే పంచుకోవాల్సి వచ్చిందట! దాంతో విసిగిపోయిన షేన్ వార్న్, ఆయన సతిమణి ఎలిజబత్ లిద్దరూ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారని మీడియాలో రూమర్లు షికారు చేస్తున్నాయి. వార్న్, హ్యరీల రిలేషన్ షిప్ వారి ప్రోఫెషనల్ జీవితానికి అడ్డంకిగా మారడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ది సన్ న్యూస్ పేపర్ వెల్లడించింది. పలమార్లు వీరిద్దరూ సర్దుకుపోదామని అనుకున్నా.. వీరి మధ్య దూరం పెరగడంతో మూడేళ్ల రిలేషన్ షిప్ కు రెండేళ్ల వివాహబంధానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. -
షేన్ వార్న్, ఎలిజబెత్ హ్యారీలు విడిపోయారా?
ప్రొఫెషనల్ జీవితంలో సుదీర్ఘ ప్రయాణాల వల్ల వైవాహిక జీవితంలో వారిద్దరూ క్వాలీటి లైఫ్ ను ఎంజాయ్ చేసింది తక్కువే కావడంతో అది వారికి అతిపెద్ద సమస్యగా మారింది. ఆస్ట్రేలియాలో షేన్ వార్న్.. బ్రిటన్ లో ఎలిజబెత్ హ్యరీలు గడపాల్సి రావడంతో కుటుంబ జీవితాన్ని ఎక్కువ శాతం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లోనే పంచుకోవాల్సి వచ్చిందట! దాంతో విసిగిపోయిన ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్, ఆయన సతిమణి ఎలిజబత్ హ్యర్లీ లిద్దరూ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారని మీడియాలో రూమర్లు షికారు చేస్తున్నాయి. వార్న్, హ్యరీల రిలేషన్ షిప్ వారి ప్రోఫెషనల్ జీవితానికి అడ్డంకిగా మారడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ది సన్ న్యూస్ పేపర్ వెల్లడించింది. పలమార్లు వీరిద్దరూ సర్దుకుపోదామని అనుకున్నా.. వీరి మధ్య దూరం పెరగడంతో మూడేళ్ల రిలేషన్ షిప్ కు రెండేళ్ల వివాహబంధానికి తెరపడింది. విడివిడిగా గడిపే దంపతుల తమ సంబంధాలను నిలుపుకోవడం చాలా కష్టమేనని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానించారు. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అరుణ్ నాయర్ తో నాలుగేళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పాకా 2010లో షేన్ వార్న్ తో డేటింగ్ ప్రారంభించింది. ఆతర్వాత ఓ సంవత్సరం తర్వాత హ్యర్లీని వార్న్ ను పెళ్లాడారు.