నువ్వక్కడ...నేనిక్కడుంటే...కుదరదు!
నువ్వక్కడ...నేనిక్కడుంటే...కుదరదు!
Published Wed, Sep 18 2013 8:07 PM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
ఆధునిక జీవితంలో మానవ సంబంధాలు అంతంత మాత్రమే అనే వాదన కాదనలేని వాస్తవం. ప్రస్తుత నాగరిక జీవితం ఉరుకులు పరుగులు మధ్య కొనసాగడం సర్వ సాధారణం. ఇక టెక్నాలజీ రంగంలో చోటు చేసుకున్న గణనీయ మార్పులు సానుకూలమైన ప్రభావాన్ని చూపాయో.. వ్యక్తుల జీవితాల్లో వ్యత్యాసాన్ని అంతే మొత్తంలో కూడా పంచాయి. ఇక టెక్నాలజీ రంగంలో అనూహ్యమైన మార్పులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగిపోవడం కూడా వ్యక్తిగత జీవితాలకు ఆర్ధికంగా బలం చేకూరాయి. అయితే అంతే మొత్తంలో వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయం తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.
సాంకేతికంగా అనేక వినియోగ, వినోదాత్మక సాధనాలు మన జీవితాల్లో ప్రవేశించిన తర్వాత మరో వ్యక్తితో మాట్లాడలేని పరిస్థితి వచ్చిపడింది. యాంత్రిక జీవితంలో ఎవరిలోకం వారిదే. ఒకే ఇంట్లో ఉన్న ఎవరీ ప్రపంచం వారిదే. మానవ అవసరాలను తీర్చడానికి అనేక సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. టెలివిజన్ లు, వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, ఇతర వినోదాత్మక, వినియోగ సాధనాలు తాత్కాలిక ఆనందాన్ని పంచుతున్నాయి. ఇవన్ని కొంత కాలంపాటు సంతృప్తిని అందించడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి.
ఇక ఒకే రకమైన జీవితం అలవాటు పడినవారికి కొద్దికాలం తర్వాత రాగానే ఏదో కోల్పోతున్నామనే భావన, అభద్రతాభావం పెరిగిపోతుంది. అప్పుడు వారిలో అసంతృప్తి కలగడం సహజం. ఆ సంతృప్తే అనేక ప్రతికూల నిర్ణయాలకు దారి తీస్తున్నాయి. ఇది సాధారణ వ్యక్తులే పరిమితం కాకుండా.. సెలబ్రీటలకు కూడా ఇదే పరిస్థితి ఎదురువుతోంది. ఉద్యోగ రీత్యా దంపతులు వేరు వేరుగా జీవించడమనది ప్రస్తుతం మనం చూస్తున్నదే. టెక్నాలజీ సాధానాలు మానసికంగా దగ్గర చేసినటప్పటికి... ప్రొఫెషనల్ లైఫ్ కారణంగా వారి మధ్య ఎడబాటు వారి సంబంధాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణమవుతున్నాయి.
అందుకు ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్, ఆయన సతీమణి ఎలిజబెత్ హ్యారీ కథే మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అరుణ్ నాయర్ తో నాలుగేళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పాకా 2010లో షేన్ వార్న్ తో డేటింగ్ ప్రారంభించింది. ఆతర్వాత ఓ సంవత్సరం తర్వాత హ్యర్లీని వార్న్ ను పెళ్లాడారు. ప్రొఫెషనల్ జీవితంలో సుదీర్ఘ ప్రయాణాల వల్ల వైవాహిక జీవితంలో క్వాలీటి లైఫ్ ను ఎంజాయ్ చేయడం లేదన్నది వారిద్దరి ఫిర్యాదు. వారి జీవితంలో ఆ అంశమే అతిపెద్ద సమస్యగా మారింది. ఆస్ట్రేలియాలో షేన్ వార్న్.. బ్రిటన్ లో ఎలిజబెత్ హ్యరీలు గడపాల్సి రావడంతో కుటుంబ జీవితాన్ని ఎక్కువ శాతం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లోనే పంచుకోవాల్సి వచ్చిందట! దాంతో విసిగిపోయిన షేన్ వార్న్, ఆయన సతిమణి ఎలిజబత్ లిద్దరూ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారని మీడియాలో రూమర్లు షికారు చేస్తున్నాయి. వార్న్, హ్యరీల రిలేషన్ షిప్ వారి ప్రోఫెషనల్ జీవితానికి అడ్డంకిగా మారడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ది సన్ న్యూస్ పేపర్ వెల్లడించింది. పలమార్లు వీరిద్దరూ సర్దుకుపోదామని అనుకున్నా.. వీరి మధ్య దూరం పెరగడంతో మూడేళ్ల రిలేషన్ షిప్ కు రెండేళ్ల వివాహబంధానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది.
Advertisement
Advertisement