'బిల్ క్లింటన్ తో అఫైర్ వార్తలు అవాస్తవం'
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో గత సంవత్సర కాలంగా ఆఫైర్ నడిపిందని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ టామ్ సైజ్ మోర్ చేసిన వ్యాఖ్యల్ని బ్రిటన్ సినీ తార ఎలిజబెత్ హార్లీ ఖండించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో గత సంవత్సర కాలంగా ఆఫైర్ నడిపిందని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ టామ్ సైజ్ మోర్ చేసిన వ్యాఖ్యల్ని బ్రిటన్ సినీ తార ఎలిజబెత్ హార్లీ ఖండించారు. బిల్ క్లింటన్ తో తనకు అఫైర్ ఉందని చేసిన వ్యాఖ్యలు చాలా తెలివి తక్కువ పని. అవాస్తవం. నా లాయర్లు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు అని హ్యార్లీ ట్విటర్ లో స్పందించారు. ఈ రోజు తనకు భయంకరమైన రోజు అని ట్విటర్ లో పేర్కోన్నారు.
'నేను ఎప్పుడు బిల్ క్లింటన్ ను కలువలేదు' అని హ్యార్లీ తెలిపింది. 1998లో వైట్ హౌజ్ లో 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్' చిత్ర ప్రదర్శన అనంతరం తాను ఎలా క్లింటన్ కు పరిచయం చేశానో అనే విషయాన్ని సైజ్ మోర్ తెలిపారు. 1992 లో రూపొందించిన పాసింజర్ 57 అనే చిత్ర సందర్భంగా ఏర్పడిన పరిచయంతో హ్యార్లీ, సైజ్ మోర్ లు కొంత కాలం డేటింగ్ చేశారు.