MCG
-
నిషిద్ధ కాంతి చిక్కింది
ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ–01–24–014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపట్టింది. వాటికి సంబంధించి అబ్బురపరిచే ఫొటోలను భూమికి పంపింది. టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ (ఏసీఎస్) ఈ ఘనత సాధించింది. అత్యంత స్పష్టతతో ఉన్న ఫొటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న ఎంసీజీ గెలాక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు. కాస్మిక్ ఫొటోగ్రఫీ చరిత్రలోనే దీన్ని అత్యంత అరుదైన ఫీట్‌గా అభివరి్ణస్తున్నారు. హబుల్ ఫొటోల్లో కన్పిస్తున్న ఎంసీజీ గెలాక్సీ పూర్తిస్థాయిలో వికసించిన నిర్మాణం, అత్యంత శక్తిమంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తోంది. ఇది అత్యంత చురుకైన కేంద్రకాలున్న టైప్–2 సీఫెర్ట్ గెలాక్సీల జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది. సీఫెర్ట్ గెలాక్సీలు అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసార్ల సమీపంలో ఉంటాయి. అయితే క్వాసార్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రమూ కని్పంచనీయనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి. సీఫెర్ట్ గెలాక్సీలు మాత్రం వీక్షణకు అనువుగానే ఉంటాయి. కానీ అత్యంత సుదూరంలో ఉన్న కారణంగా వీటి వెలుతురు ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కలేదు. ఆ కారణంగానే సైంటిస్టుల పరిభాషలో దాన్ని ‘నిషిద్ధ కాంతి’గా ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. పైగా ఈ కాంతి పుంజాలు భూమ్మీద మనకు ఇప్పటిదాకా తెలిసిన పరిమాణ భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తిగా అతీతమన్నది సైంటిస్టుల నమ్మకం. అనంత విశ్వంలో అంతటి సుదూర అంతరిక్ష క్షేత్రంలో మన భౌతిక శాస్త్ర నియమాలన్నీ తల్లకిందులవుతాయని వారు చెబుతుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వారం తర్వాత మెల్బోర్న్ చేరిన వార్న్ భౌతిక కాయం..
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ స్పిన్ లెజెండ్ షేన్‌వార్న్ పార్థివ దేహం మెల్బోర్న్కు చేరుకుంది. బ్యాంకాక్‌లో గత శుక్రవారం గుండెపోటుతో 52 ఏళ్ల వార్న్ హఠాన్మరణం చెందాడు. అతని భౌతిక కాయంపై ఆస్ట్రేలియా జాతీయ పతాకాన్ని ఉంచారు. థాయ్‌లాండ్ నుంచి ప్రైవేటు జెట్ విమానంలో అతని పార్థివ దేహాన్ని సన్నిహితులు, వ్యక్తిగత సహాయకుడు స్వదేశానికి తీసుకొచ్చారు. తన కెరీర్‌కే వన్నె తెచ్చిన ఎంసీజీలో ఈ నెల 30న ప్రభుత్వ లాంఛనాలతో వార్న్ అంత్యక్రియలు చేసేందుకు ఆస్ట్రేలియా నిర్ణయించింది. సుమారు లక్ష మంది ఇందులో పాల్గొనే అవకాశముంది. చదవండి: Jofra Archer: ఖుషీలో ముంబై ఇండియన్స్.. రాడనుకున్న ఆర్చర్ వచ్చేస్తున్నాడు..! వీడియో: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
వార్న్‌కు ఘన నివాళి
మెల్బోర్న్: శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందిన స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా నివాళులు అర్పించారు. ఎంసీజీ బయట ఉన్న అతని విగ్రహం వద్ద పూలు ఉంచి ఆస్ట్రేలియా ఫ్యాన్స్ స్పిన్ దిగ్గజం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు వార్న్ కుటుంబ సభ్యులు అనుమతిస్తే అధికారిక లాంఛనాలతో అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ‘మా దేశానికి చెందిన గొప్ప వ్యక్తుల్లో ఒకడిగా వార్న్ నిలిచిపోతాడు. అతని బౌలింగ్‌లో ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వార్న్ తన జీవితాన్ని కూడా అద్భుతంగా జీవించాడు’ అని ఆయన సంతాపం ప్రకటించారు. ఎంసీజీలోని గ్రేట్ సదరన్ స్టాండ్‌కు షేన్ వార్న్ పేరు పెడుతున్నట్లు కూడా ఆసీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వార్న్ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఇంగ్లీష్ కౌంటీ ‘హాంప్‌షైర్’ ప్రధాన కేంద్రమైన సౌతాంప్టన్‌లో కూడా అతనికి సంతాపం ప్రకటిస్తూ పలు కార్యక్రమాలు జరిగాయి. రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లండ్ అభిమానులు వార్న్‌కు నివాళులు అర్పించారు. -
'ఆ మ్యాచ్‌లో నన్ను గెట్ అవుట్ అన్నారు'
మెల్బోర్న్ : టీమిండియా మాజీ ఆటగాడు.. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఆసీస్ ఆటగాళ్లతో జరిగిన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. తాను అవుట్ కాకున్నా అంపైర్ అవుట్ ఇచ్చాడని.. వెంటనే ఆసీస్ ఆటగాళ్లు తన వద్దకు వచ్చి గెట్ అవుట్ అంటూ సింబల్ చూపించారని గవాస్కర్ తెలిపాడు.1981లో మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ డేమియన్ ప్లెమింగ్‌తో జరిగిన సంభాషణలో గవాస్కర్ ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. అసలు విషయంలోకి వెళితే.. ఆ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ డెన్నీస్ లిల్లీ వేసిన బంతి గవాస్కర్ బ్యాట్‌ను తాకి ఆపై ప్యాడ్లను తాకింది. ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగానే అంపైర్ వెంటనే అవుట్ ఇచ్చాడు. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవాస్కర్ పిచ్‌ను వీడలేదు. డెన్నీస్ లిల్లీ సహా ఇతర ఆటగాళ్లు గవాస్కర్ వద్దకు వచ్చి అంపైర్ అవుటిచ్చాడు.. గెట్ అవుట్ మ్యాన్ అంటూ కామెంట్ చేశారు. (చదవండి : ఆ క్యాప్ ధరించడం ఇష్టం లేదు : స్టోక్స్) Did you know Sunil Gavaskar has the match ball from the 1983 World Cup final? The 'original little master' joins @bowlologist for a career retrospective 🙌 pic.twitter.com/jYee97Hq4m — 7Cricket (@7Cricket) December 28, 2020 దీంతో కోపంతో ఊగిపోయిన గవాస్కర్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న చేతన్ చౌహన్‌ను తీసుకొని మైదానం వీడే ప్రయత్నం చేశాడు. ఈ చర్యతో ఆసీస్ ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇద్దరు కలిసి పెవిలియన్‌కు చేరుకుంటుండగా భారత మేనేజర్ కిందకు వచ్చి గవాస్కర్‌కు సర్ధి చెప్పి చేతన్ చౌహన్‌ను వెనక్కి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఎప్పుడు కూల్‌గా కనిపించే గవాస్కర్‌లో ఇంతటి కోపం దాగి ఉందా అని క్రికెట్ ప్రేమికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 59 పరుగులతో విజయం సాధించింది. భారత ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ 5 వికెట్లతో విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 83 పరుగులకే కుప్పకూలి పరాజయం మూట గట్టుకుంది. (చదవండి : టీమిండియానే ఈ సిరీస్ గెలవాలి: పాక్ క్రికెటర్) -
మహిళల క్రికెట్లో ప్రపంచ రికార్డు!
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆసీస్ మరోసారి ముద్దాడింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మెగా కప్‌ను ఐదోసారి అందుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్ బెత్ మూనీ (61 నాటౌట్; 43 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటై పరాజయం చెందింది.(మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) కాగా, ఈ టీ20 కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఒక ప్రపంచ రికార్డు నమోదైంది. రికార్డు సంఖ్యలో 86,174 మంది ప్రేక్షకులు మ్యాచ్‌కు హాజరయ్యారు. దాంతో ఇది సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలో రికార్డు వీక్షక్షులు హాజరైన మ్యాచ్‌గా నిలిచింది. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకూ జరిగిన మహిళల స్పోర్ట్స్ ఈవెంట్ పరంగా చూసినా ఎక్కువ మంది హాజరైన మ్యాచ్ ఇదే. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున జరిగిన మ్యాచ్‌కు ఇంతటి విశేష ఆదరణ రావడం ఇక్కడ మరో విశేషం. ఓవరాల్‌గా చూస్తే మహిళల స్పోర్ట్స్ ఈవెంట్లో అత్యధిక మంది వీక్షకుల హాజరైన మ్యాచ్ 1999లో కాలిఫోర్నియాలో జరిగిన సాకర్ వరల్డ్‌కప్ ఫైనల్. 21 ఏళ్ల నాటి మహిళల సాకర్ ఫైనల్ మ్యాచ్‌కు 90, 185 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. (మన వనిత... పరాజిత) -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రికీ పాంటింగ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్లో బుధవారం మొదలైన మూడో టెస్టు తొలి రోజు ఆట టీ విరామ సమయంలో అతడు ఆస్ట్రేలియాకే చెందిన మేటి బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ చేతుల మీదుగా హాల్ ఆఫ్ ఫేమ్ టోపీని అందుకున్నాడు. గత జూలైలో ఐర్లాండ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశం సందర్భంగా రాహుల్ ద్రవిడ్ (భారత్), ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ క్లెయిర్ టేలర్, పాంటింగ్‌లను హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఎంపిక చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం టోపీని స్వీకరించాడు. ‘ఈ అనుభూతిని వర్ణించలేను. మెల్బోర్న్ మైదానంలో వేలాది మంది ప్రేక్షకుల మధ్య ఈ గౌరవాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని 44 ఏళ్ల పాంటింగ్ అన్నాడు. ఆస్ట్రేలియా తరఫున పాంటింగ్ 168 టెస్టులు ఆడి 13,378 పరుగులు; 375 వన్డేలు ఆడి 13,704 పరుగులు సాధించాడు. -
అక్కడ తొలి నాసిరకం పిచ్ ఇదే !
మెల్బోర్న్: ఊహించినట్లుగానే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ జరిగిన ఈ పిచ్‌ను నాసిరకం(పూర్)గా పేర్కొంటూ ఐసీసీ నివేదిక ఇచ్చింది. ఈ మేరకు పిచ్‌కు సంబంధించి రెండు వారాల్లో నివేదికను అందజేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు స్పష్టం చేసింది. టెస్టు మ్యాచ్ ముగిసిన తరువాత మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే తన నివేదికను ఐసీసీకి అందజేశారు. పిచ్, అవుట్ ఫీల్డ్ నిర్వహణకు సంబంధించి నివేదిక ఇచ్చిన మదుగలే ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఈ పిచ్ ఐదు రోజుల ఆటకు ఎంతమాత్రం యోగ్యం లేదని నివేదికలో పేర్కొన్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇక్కడ బౌన్స్‌లో చాలా తేడాలు ఉండటంతో పాటు సీమ్ గమనం చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని మదుగలే వివరించినట్లు తెలిపింది. దానిలో భాగంగా పిచ్ రూపకల్పనపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును నివేదిక కోరింది. తుది సమీక్షలో మెల్బోర్న్ పిచ్ కనీస ప్రమాణాలను పాటించలేదని తేలితే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలో టెస్టు వేదికల పరంగా చూస్తే ఈ తరహా తక్కువ రేటింగ్ వచ్చిన తొలి పిచ్ ఇదే కావడం గమనార్హం. ఆరు రకాలుగా విభజన... అంతర్జాతీయ పిచ్‌లను నాసిరకం (పూర్)గా గుర్తించే ముందు ఐసీసీ కొన్ని ప్రమాణాలు పాటిస్తుంది. టెస్టు మ్యాచ్ పిచ్‌కు రేటింగ్ ఇవ్వడంలో ఆరు రకాల కేటగిరీలు ఉన్నాయి. వెరీ గుడ్, గుడ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, పూర్, అన్‌ఫిట్ అనే కేటగిరీలు ఉన్నాయి. ఇందులో పిచ్ ప్రమాదకరంగా ఉంటే అన్‌ఫిట్‌గా తేలుస్తారు. ఇప్పుడు మెల్బోర్న్ పిచ్‌ను ఐసీసీ పూర్ కేటగిరీలో చేర్చింది. ఇందు కోసం నాలుగు అంశాలు ప్రామాణికంగా ఉంటాయి. మ్యాచ్‌లో ఏ దశలోనైనా బంతి సీమ్ గమనం చాలా ఎక్కువగా ఉండటం. మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై బౌన్స్‌లో తేడాలు చాలా ఎక్కువగా ఉండటం. మ్యాచ్ ప్రారంభంలోనే పిచ్ స్పిన్ బౌలర్లకు చాలా ఎక్కువగా సహకరించడం. మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై అసలు ఏమాత్రం బంతి సీమ్, టర్న్ కాకపోవడం లేదా అసలు బౌన్స్ లేకపోవడం. ఈ రకంగా బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతూకాన్ని ఏ మాత్రం పాటించకపోవడాన్ని పూర్ పిచ్‌గా నిర్దారిస్తారు. -
పరువు కోసం ఇంగ్లండ్ పోరాటం
మెల్బోర్న్: ఇప్పటికే ఇంగ్లండ్ యాషెస్ సిరీస్‌ను కోల్పోయింది. ఇంకా సాధించడానికేమీ లేదు. కానీ పరువు నిలుపుకోవాలంటే చివరి రెండు టెస్టుల్లో గెలవాలి. ఈ నేపథ్యంలో ‘బాక్సింగ్ డే’ టెస్టులో విజయమే లక్ష్యంగా ఇంగ్లండ్... ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. మంగళవారం నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఈ మ్యాచ్ జరగనుంది. వరుస వైఫల్యాలతో ఆటగాళ్లు, ఘోర పరాజయాలతో ఇంగ్లండ్ జట్టు ఈ ‘యాషెస్’లో విలవిలాడుతోంది. విశేష అనుభవమున్న అలెస్టర్ కుక్ పేలవ ఫామ్ జట్టును కలవరపరుస్తోంది. స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీలు కూడా బాధ్యతలకు దూరంగా... జట్టుకు భారంగా మారారు. కెప్టెన్ రూట్‌కు ఇప్పటిదాకా ఆసీస్ గడ్డపై ఏ మ్యాచ్ కూడా కలిసిరాలేదు. భారీ పరాజయాలతోనే మ్యాచ్‌ల్ని, సిరీస్‌ను కోల్పోయాడు. ఇప్పటికైనా సీనియర్లు బాధ్యతలు పంచుకుంటే జట్టు గాడిన పడుతుందని రూట్ భావిస్తున్నాడు. దీంతో కనీసం ట్రోఫీ పోయినా పరువు కాపాడుకోవచ్చని ఆశిస్తున్నాడు. ఇంగ్లండ్ యువ పేసర్ టామ్ కురన్ ఈ టెస్టుతో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా సారథి స్టీవెన్ స్మిత్ అసాధారణ ఫామ్‌తో ఉన్నాడు. ఆత్మవిశ్వాసంతో ఉన్న కంగారూ జట్టు వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది. గాయపడిన మిచెల్ స్టార్క్ స్థానంలో జాక్సన్ బర్డ్ నాలుగో టెస్టు బరిలోకి దిగుతాడని కెప్టెన్ స్మిత్ చెప్పాడు. ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ 2019 తర్వాత బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2013 నుంచి ఆయన కోచింగ్‌లో ఆసీస్ సొంతగడ్డపై రెండు యాషెస్ సిరీస్‌లను గెలుచుకోగా.. ఇంగ్లండ్‌లో మరో రెండు ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్ సాధించిన విషయం తెలిసిందే. -
రెండో టెస్టుకు భద్రత పెంపు
మెల్బోర్న్:ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎమ్సీజీ)లో జరుగనున్న రెండో టెస్టుకు భద్రతను మరింత పెంచారు. ఇటీవల మెల్ బోర్న్ లో ఉగ్రవాద సంబధిత అరెస్టుల జరిగిన నేపథ్యంలో సోమవారం నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. 'ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండటంతో బాక్సింగ్ డే టెస్టుకు భద్రతను పెంచేందుకు సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు మిగతా క్రికెట్ మ్యాచ్‌లు జరిగే ప్రదేశాల్లో కూడా భద్రత పెంచే యోచనలో ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. మ్యాచ్ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి'అని ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సథర్లాండ్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తూ ఏడుగురు యువకుల్ని పోలీసులు అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశారు. మెల్బోర్న్ ఫ్లైండర్స్ స్ట్రీట్ ట్రైన్ స్టేషన్‌పై దాడి చేయడానికి ఆ యువకులు ప్రణాళిక రచించినట్లు పోలీసులు చెబుతున్నారు. -
శతఘ్నుల కొనుగోలుకు కుదిరిన ఒప్పందం
న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఎం777 రకానికి చెందిన 145 శతఘ్నుల కొనుగోలుకు సంబంధించి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటి విలువ దాదాపు రూ.5 వేల కోట్లు. 1980ల్లో జరిగిన బొఫోర్స్ కుంభకోణం తర్వాత ఫిరంగుల కొనుగోలుకు సంబంధించి కుదిరిన తొలి ఒప్పందం ఇదే. 15వ భారత్–అమెరికా సైన్య సహకార బృందం సమావేశాల్లో ఒప్పందం కుదిరింది. అగ్రదేశం నుంచి కొనుగోలు చేయనున్న శతఘ్నులను ఎక్కువగా చైనా సరిహద్దుల్లో మోహరించనున్నారు. -
గుర్గావ్లో త్వరలో సైకిల్‌ట్రాక్‌లు
కన్సల్టెంట్‌ను నియమించిన ఎంసీజీ * రెండు విడతలుగా పనులు * ట్రాక్‌ల వెంట పార్కింగ్ వసతి * టెండర్లు పిలవనున్న కార్పొరేషన్ * 26 వారాల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం గుర్గావ్ : నగరంలో త్వరలో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం గుర్గావ్ నగరపాలక సంస్థ (ఎంసీజీ) ఓ కన్సల్టెంట్‌ను నియమించనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. తాము నియమించే కన్సల్టెంట్ ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టును సమర్పిస్తారని అన్నారు. ఈ ట్రాక్‌లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి త్వరలో అధ్యయనం చేయిస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 1.05 కోట్ల మేర నిధులను వెచ్చిస్తామన్నారు. రెండు విడతలుగా పనులను పూర్తిచేస్తామన్నారు. రెండో విడతలో భాగంగా ఈ ట్రాక్‌ల వెంట సైక్లిస్టుల కోసం పార్కింగ్ వసతి కల్పిస్తామన్నారు. కొత్త నగరంతోపాటు పాతనగరంలోనూ ట్రాక్‌లను నిర్మిస్తామన్నారు. త్వరలోనే టెండర్లను పిలుస్తామని, పనుల పూర్తికి 26 వారాల గడువు విధిస్తామని అన్నారు. ఇదిలాఉంచితే ఓల్డ్ ఢిల్లీ-గుర్గావ్ రోడ్డు, మెహ్రౌలి రోడ్డులలో ఈ ట్రాక్‌లను నిర్మించాలని ఎంసీజీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైంది. అయితే పట్టణ స్థానిక సంస్థ ల విభాగం కార్యదర్శి రఘువేందర్‌రావు ఈ ప్రణాళికను రద్దు చేశారు. సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజా ప్రణాళికతో ఎంసీజీ ముందుకెళుతోంది. కాగా ఈ నగరానికి ఎన్నో ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నప్పటి కీ సైకిల్ ట్రాక్‌లు మాత్రం లేకపోవడం గమనార్హం. -
ఇకపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు తప్పనిసరి
గుర్గావ్: కొత్తగా నిర్మించే ఇల్లు, భవన సముదాయాలు, హౌసింగ్ సొసైటీలపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయడాన్ని గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ) తప్పనిసరి చేసింది. దీర్ఘకాలంగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న నగరవాసుల సమస్యకు ఇదొక్కటే పరిష్కారమని ఎంసీజీ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. సోలార్ ప్యానల్లు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించిన భవనాలకు మాత్రమే నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలనే యోచనలో ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అంటే గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా ఇల్లు కొన్నా, కొత్త ఇల్లు కట్టుకున్నా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించినట్లు రుజువులు చూపాల్సి ఉంటుంది. అంతటితోనే కాకుండా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు కూడా హామీ పత్రం ఇవ్వాలి. అంటే ఇంటి నిర్మాణానికి సంబంధించిన లేఅవుట్లోనే సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలుండాలి. అప్పుడే దానికి ఆమోదముద్ర పడుతుంది. అయితే ఇది కేవలం కొత్తగా నిర్మించనున్న ఇళ్లకే కాకుండా ఇప్పటికే నిర్మించిన ఇళ్లకు కూడా వర్తింపజేసే యోచనలో ఉన్నట్లు కూడా ఎంసీజీ అధికారి తెలిపారు. అయితే తమ మొదటి దృష్టి మాత్రం కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లపైనే సారిస్తామన్నారు. కాగా ఈ విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎంసీజీ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ... ‘నగరంలో విద్యుత్ కొరత సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. సంప్రదాయ విద్యుత్ వనరులు రోజురోజుకు తగ్గుతున్నాయి. తగ్గకుండా మూడు కాలాలపాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగేది ఒక్క సోలార్ పవర్‌ను మాత్రమే. అందుకే దీనిపై ఎంసీజీ దృష్టి సారించి, ఈ కీలక నిర్ణయాలు తీసుకుంద’ని చెప్పారు. -
రహదారులపై ‘రాహ్‌గిరి’
గుర్గావ్: రోడ్లపై ద్విచక్ర, మోటారుర హిత వాహనాలను ప్రోత్సాహించడానికి కొన్ని అంతర్జాతీయ నగరాల్లో నిర్వహిస్తున్న రాహ్గిరిని గుర్గావ్లో అమలు చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విధానంలో రోడ్డును విభజించి ద్విచక్ర, మోటారు రహిత వాహనాలకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తారు. ఏడు నెలల క్రితమే తొలిసారిగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు గుర్గావ్లో రాహ్గిరిని నిర్వహించాయి. ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గుర్గావ్ (ఎంసీజీ) కమిషనర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా 12 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్లపై ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక లేన్‌ను నిర్మిస్తామని ప్రకటించారు. ఈ లేన్ నాలుగు మీటర్ల పొడవు ఉంటుందని వెల్లడించారు. వాహనదారులు ఈ లేన్‌ను సులువుగా గుర్తించేందుకు వీలుగా ఎరుపురంగుతో గీత గీస్తామన్నారు. చిన్న రోడ్లపై మొదట ప్రయోగాత్మకంగా ఈ లేన్లను ఏర్పాటు చేసి, తదనంతరం మిగతా వాటికి విస్తరిస్తామని చెప్పారు. ఈ ప్రణాళికను ఎంసీజీ పరిధిలోని రోడ్లపై మొదట అమలు చేస్తామని తెలిపారు. నగరవ్యాప్తంగా దీనిని అమలు చేయడానికి ఇతర కార్పొరేషన్లతో చేతులు కలుపుతున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ గుర్గావ్లోని కొన్ని ప్రాంతాలు హుడా పరిధిలో ఉన్నాయి కాబట్టి దానితోనూ చర్చిస్తామని ప్రవీణ్ వివరించారు. పంజాబ్, హర్యానా ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంసీజీ, కొన్ని స్వచ్ఛందసంస్థలతో కలసి ఈ ఆదివారం రాహ్‌గిరి నిర్వహిస్తోంది. అయితే ఎన్జీఓలు గతంలో సొంతంగా రాహ్‌గిరి నిర్వహించడంపై ప్రవీణ్ మాట్లాడుతూ ‘ఇటువంటి కార్యక్రమాలకు మేం వ్యతిరేకం కాదు. రాహ్గిరిని మేము క్రమబద్ధీకరిస్తున్నాం. ప్రతీ దీ పద్ధతి ప్రకారం జరగాలన్నది మా ఉద్దేశం’ అని విశదీకరించారు. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సారికా పాండా ఈ విషయమై మాట్లాడుతూ ‘గతంలో జరిగిన వాటి గురించి ఆలోచిండ చం వృథా. మేం భవిష్యత్ గురించి ఆలోచించాలని అనుకుంటున్నాం. ఇక నుంచి రాహ్గిరిని సానుకూలంగా నిర్వహిస్తాం. ఇది స్వచ్ఛందసంస్థల కార్యక్రమం కాదు. గుర్గావ్వాసులంతా చురుగ్గా పాల్గొన్నారు కాబట్టే విజయవంతమయింది. రోడ్డు భద్రత, మోటారు రహిత రవాణా, శారీరక దారుఢ్యం, చట్టపరమైన అంశాలు వంటివాటిపై అవగాహన కల్పించడమే మా ఎజెండా. రాహ్‌గిరి గురించి ఎంసీజీ వేసవినృత్య శిబిరం నిర్వహిస్తే మేం సంతకాల ఉద్యమం చేపడుతాం. గుర్గావ్ పోలీసులు ప్రత్యేకంగా క్విజ్ నిర్వహిస్తారు. నగర మెజిస్ట్రేట్ చట్టపరమైన అంశాల గురించి చెబుతారు’ అని ఆమె వివరించారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ సందడి నడుస్తోంది కాబట్టి కొందరు స్వచ్ఛంద సభ్యులు వీధు ల్లో సాకర్ పోటీలు నిర్వహించి రాహ్గిరిపై అవగాహన కలిగించాలని కూడా భావిస్తున్నారు. -
మళ్లీ సుప్రీంకోర్టుకు చేరిన క్యాంపాకోలా కేసు
న్యూఢిల్లీ: ముంబైలోని వర్లి క్యాంపాకోలా ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన 40 ఫ్లాట్ల యాజమానులు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. వీరంతా శనివారం లోపు ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించడం తెలిసిందే. బాధితుల పిటిషన్‌పై మంగళవారం విచారణ నిర్వహిస్తామని జగదీశ్ సింగ్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. క్యాంపాకోలా ప్రాంతంలో అక్రమంగా వెలిసిన అంతస్తులను ఖాళీ చేయించేందుకు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ రెండు లోపు భవనాలను ఖాళీ చేసి దక్షిణవార్డు కార్యాలయంలో తాళాలు అప్పగించాలని అక్రమ ఫ్లాట్ల యాజమానులకు నోటీసులు జారీ చేసింది. తాళాలు అప్పగించని వారిపై ఏం చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టునే తిరిగి ఆశ్రయిస్తామని ప్రకటించింది. మే 31లోపు ఇళ్లను ఖాళీ చేస్తామని ఎంసీజీఎంకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని క్యాంపాకోలా వాసులను అత్యున్నత న్యాయస్థానం గత నవంబర్‌లో ఆదేశించడం తెలిసిందే.