అమెరికా నుంచి ఎం777 రకానికి చెందిన 145 శతఘ్నుల కొనుగోలుకు సంబంధించి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఎం777 రకానికి చెందిన 145 శతఘ్నుల కొనుగోలుకు సంబంధించి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటి విలువ దాదాపు రూ.5 వేల కోట్లు. 1980ల్లో జరిగిన బొఫోర్స్ కుంభకోణం తర్వాత ఫిరంగుల కొనుగోలుకు సంబంధించి కుదిరిన తొలి ఒప్పందం ఇదే.
15వ భారత్–అమెరికా సైన్య సహకార బృందం సమావేశాల్లో ఒప్పందం కుదిరింది. అగ్రదేశం నుంచి కొనుగోలు చేయనున్న శతఘ్నులను ఎక్కువగా చైనా సరిహద్దుల్లో మోహరించనున్నారు.