రెండో టెస్టుకు భద్రత పెంపు
మెల్బోర్న్:ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎమ్సీజీ)లో జరుగనున్న రెండో టెస్టుకు భద్రతను మరింత పెంచారు. ఇటీవల మెల్ బోర్న్ లో ఉగ్రవాద సంబధిత అరెస్టుల జరిగిన నేపథ్యంలో సోమవారం నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు.
'ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండటంతో బాక్సింగ్ డే టెస్టుకు భద్రతను పెంచేందుకు సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు మిగతా క్రికెట్ మ్యాచ్లు జరిగే ప్రదేశాల్లో కూడా భద్రత పెంచే యోచనలో ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. మ్యాచ్ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి'అని ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సథర్లాండ్ తెలిపారు.
కొన్ని రోజుల క్రితం ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తూ ఏడుగురు యువకుల్ని పోలీసులు అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశారు. మెల్బోర్న్ ఫ్లైండర్స్ స్ట్రీట్ ట్రైన్ స్టేషన్పై దాడి చేయడానికి ఆ యువకులు ప్రణాళిక రచించినట్లు పోలీసులు చెబుతున్నారు.