గుర్గావ్‌లో త్వరలో సైకిల్‌ట్రాక్‌లు | Cycle tracks in Gurgaon soon | Sakshi
Sakshi News home page

గుర్గావ్‌లో త్వరలో సైకిల్‌ట్రాక్‌లు

Published Sat, Oct 18 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

గుర్గావ్‌లో త్వరలో సైకిల్‌ట్రాక్‌లు

గుర్గావ్‌లో త్వరలో సైకిల్‌ట్రాక్‌లు

కన్సల్టెంట్‌ను నియమించిన ఎంసీజీ
* రెండు విడతలుగా పనులు
* ట్రాక్‌ల వెంట పార్కింగ్ వసతి
* టెండర్లు పిలవనున్న కార్పొరేషన్
* 26 వారాల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం

గుర్గావ్ : నగరంలో త్వరలో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం గుర్గావ్ నగరపాలక సంస్థ (ఎంసీజీ) ఓ కన్సల్టెంట్‌ను నియమించనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. తాము నియమించే కన్సల్టెంట్ ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టును సమర్పిస్తారని అన్నారు. ఈ ట్రాక్‌లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి త్వరలో అధ్యయనం చేయిస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 1.05 కోట్ల మేర నిధులను వెచ్చిస్తామన్నారు. రెండు విడతలుగా పనులను పూర్తిచేస్తామన్నారు. రెండో విడతలో భాగంగా ఈ ట్రాక్‌ల వెంట సైక్లిస్టుల కోసం పార్కింగ్ వసతి కల్పిస్తామన్నారు.

కొత్త నగరంతోపాటు పాతనగరంలోనూ ట్రాక్‌లను నిర్మిస్తామన్నారు. త్వరలోనే టెండర్లను పిలుస్తామని, పనుల పూర్తికి 26 వారాల గడువు విధిస్తామని అన్నారు. ఇదిలాఉంచితే ఓల్డ్ ఢిల్లీ-గుర్గావ్ రోడ్డు, మెహ్రౌలి రోడ్డులలో ఈ ట్రాక్‌లను నిర్మించాలని ఎంసీజీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైంది. అయితే పట్టణ స్థానిక సంస్థ ల విభాగం కార్యదర్శి రఘువేందర్‌రావు ఈ ప్రణాళికను రద్దు చేశారు. సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజా ప్రణాళికతో ఎంసీజీ ముందుకెళుతోంది. కాగా ఈ నగరానికి ఎన్నో ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నప్పటి కీ సైకిల్ ట్రాక్‌లు మాత్రం లేకపోవడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement