మెల్‌బోర్న్: ఊహించినట్లుగానే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ జరిగిన ఈ పిచ్‌ను నాసిరకం(పూర్)గా పేర్కొంటూ ఐసీసీ నివేదిక ఇచ్చింది. ఈ మేరకు పిచ్‌కు సంబంధించి రెండు వారాల్లో నివేదికను అందజేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు స్పష్టం చేసింది.
టెస్టు మ్యాచ్ ముగిసిన తరువాత మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే తన నివేదికను ఐసీసీకి అందజేశారు. పిచ్, అవుట్ ఫీల్డ్ నిర్వహణకు సంబంధించి నివేదిక ఇచ‍్చిన మదుగలే ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఈ పిచ్ ఐదు రోజుల ఆటకు ఎంతమాత్రం యోగ్యం లేదని నివేదికలో పేర్కొన్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇక్కడ బౌన్స్‌లో చాలా తేడాలు ఉండటంతో పాటు సీమ్ గమనం చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని మదుగలే వివరించినట్లు తెలిపింది. దానిలో భాగంగా పిచ్ రూపకల్పనపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును నివేదిక కోరింది.
తుది సమీక్షలో మెల్‌బోర్న్ పిచ్ కనీస ప్రమాణాలను పాటించలేదని తేలితే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలో టెస్టు వేదికల పరంగా చూస్తే ఈ తరహా తక్కువ రేటింగ్ వచ్చిన తొలి పిచ్ ఇదే కావడం గమనార్హం.
ఆరు రకాలుగా విభజన...
అంతర్జాతీయ పిచ్‌లను నాసిరకం (పూర్)గా గుర్తించే ముందు ఐసీసీ కొన్ని ప్రమాణాలు పాటిస్తుంది. టెస్టు మ్యాచ్ పిచ్‌కు రేటింగ్ ఇవ్వడంలో ఆరు రకాల కేటగిరీలు ఉన్నాయి. వెరీ గుడ్, గుడ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, పూర్, అన్‌ఫిట్ అనే కేటగిరీలు ఉన్నాయి. ఇందులో పిచ్ ప్రమాదకరంగా ఉంటే అన్‌ఫిట్‌గా తేలుస్తారు. ఇప్పుడు మెల్‌బోర్న్ పిచ్‌ను ఐసీసీ పూర్ కేటగిరీలో చేర్చింది. ఇందు కోసం నాలుగు అంశాలు ప్రామాణికంగా ఉంటాయి.
మ్యాచ్‌లో ఏ దశలోనైనా బంతి సీమ్ గమనం చాలా ఎక్కువగా ఉండటం.
మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై బౌన్స్‌లో తేడాలు చాలా ఎక్కువగా ఉండటం.
మ్యాచ్ ప్రారంభంలోనే పిచ్ స్పిన్ బౌలర్లకు చాలా ఎక్కువగా సహకరించడం.
మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై అసలు ఏమాత్రం బంతి సీమ్, టర్న్ కాకపోవడం లేదా అసలు బౌన్స్ లేకపోవడం. ఈ రకంగా బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతూకాన్ని ఏ మాత్రం పాటించకపోవడాన్ని పూర్ పిచ్‌గా నిర్దారిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment